కోట్లాది మందికి మేలు చేసే పని చేయగానే సరిపోదు. ఆ విషయాన్ని చెప్పాల్సిన రీతిలో చెప్పుకోకపోతే ప్రజలు సైతం హర్షించరు. ఈ విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై ఫుల్ క్లారిటీతో ఉన్నట్లున్నారు. తాజాగా ఆమె చేసిన ట్వీట్ ఒకటి ఆసక్తికరంగానే కాదు.. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు చేతకానితనాన్ని వేలు పెట్టి మరీ చూపించినట్లైంది.
ఒక్క మాట అనకుండా.. కేసీఆర్ సర్కారు వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించటమే కాదు.. అందుకు తానేం చేసింది చెప్పి.. రాష్ట్రం కోసం తాను పడుతున్న తపనను కొత్త కోణంలో చూపించారని చెప్పాలి. ఇంతకూ గవర్నర్ తమిళ సై చేసిన ట్వీట్ లో ఏమున్నదన్నది చూస్తే.. హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రికి వెంటిలేటర్లు.. కోవిడ్ ఐసీయూలతో పాటు.. రోజకు రెండు మూడు వేల వరకూ కరోనాపరీక్షలు చేసే యంత్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసినట్లుగా ఆమె పేర్కొన్నారు.
కేంద్రం నుంచి ఎలాంటి సహకారం పెద్దగా అందటం లేదన్న విమర్శ చేస్తున్న కేసీఆర్ సర్కారు మాటల్లోని డొల్లతనాన్ని చూపించేలా పరిణామాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో కరోనా నిర్దారణ పరీక్షలు తక్కువగా చేయటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం కావటం తెలిసిందే.
కరోనా పరీక్షలు ఎక్కువ చేయకపోవటానికి కారణం.. వాటిని పరీక్షించే వ్యవస్థల సామర్థ్యమేనని చెబుతున్నారు. తెలంగాణకు వచ్చిన కరోనా పరీక్షా యంత్రాల్ని కేంద్రం పశ్చిమబెంగాల్ కు తీసుకెళ్లినట్లుగా ఆ మధ్యన తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు చేయటం తెలిసిందే. దాని స్థానే.. రాష్ట్రానికి మరో యంత్రాన్ని ఇవ్వాలని కేంద్రాన్ని అడిగిన దాఖలాలు లేవంటున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా మాత్రం కరోనా పరీక్షల్ని పెంచేందుకు వీలుగా ఫలితాల్ని వెల్లడించేయంత్రాన్ని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రిని తాను కోరినంతనే ఒకటి ఈఎస్ఐ ఆసుపత్రికి పంపుతున్న వైనాన్ని పేర్కొంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాస్తవానికి ఇలాంటి పనులు రాష్ట్ర ముఖ్యమంత్రి.. లేదంటే రాష్ట్ర మంత్రి ఈటెల లాంటి వారు చేయాలి.
అందుకు భిన్నంగా గవర్నర్ కలుగుజేసుకొని రాష్ట్రానికి అవసరమైన యంత్రాన్ని తెప్పించటంలో కీలకభూమిక పోషించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. కేసీఆర్ వ్యతిరేకులు కారాలు మిరియాలు నూరే వారికి మరింత శక్తిని ఇచ్చేలా తెలంగాణ గవర్నర్ ట్వీట్ ఉందని చెప్పక తప్పదు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. తాజా ట్వీట్ తో రాజకీయ కదలికకు కారణమవుతుందని చెప్పక తప్పదు.