హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం

Update: 2021-02-04 03:55 GMT
అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు కేంద్రం తలుపులు బార్లా తీయడంతో ప్రస్తుతం ప్రయాణాలపై పెద్దగా ఆంక్షలు లేవు. అయితే విమానాశ్రయాల్లో మాత్రం ఖచ్చితంగా వారికి కోవిడ్ టెస్ట్ చేయించి నెగెటివ్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం చోటుచేసుకుంది. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఐదు విమానాల్లో వచ్చిన ప్యాసింజర్లలో 15మందికి కరోనా వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 300మందిని క్వారంటైన్ కు తరలించారు.

బ్రిటన్ లో నిర్వహించిన టెస్టుల్లో వీరందరికీ నెగెటివ్ రాగా.. హైదరాబాద్ లో చేసిన పరీక్షల్లో పాజిటివ్ రావడం గమనార్హం. దీంతో అధికారులు అప్రమత్తమై మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

కాగా బ్రిటన్ లో ప్రబలిన డేంజర్ యూకే స్ట్రెయిన్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయపెట్టింది. అది డేంజర్ వైరస్ గా నిర్ధారణ కావడంతో బ్రిటన్ కు రాకపోకలు కూడా కట్ చేశారు. తాజాగా ఇది యూకే స్ట్రెయిన్ కరోనాగా అధికారులు అనుమానిస్తున్నారు.
Tags:    

Similar News