లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పిన వైనం బాగానే ఉన్నా.. అదంతా ఎప్పటివరకు..? ఇప్పుడున్న పరిస్థితులు కొనసాగే పక్షంలో ఆయన మాటలు అమలు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా భారీగా కేసులు నమోదవుతూ.. రాష్ట్రం మరో మహారాష్ట్రగా మారితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని అయినా తీసుకునే వీలుందన్నది మర్చిపోకూడదు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాన్ని చూస్తే.. కరోనా విషయంలో కేసీఆర్ మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిందా? అన్న సందేహం కలుగక మానదు.
గడిచిన కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొదట తెలంగాణలో ఎక్కువగా కనిపించినా.. ఏపీలో పెద్దగా కనిపించలేదు. అందుకు భిన్నంగా ఇప్పుడు ఏపీలో రోజుకు వెయ్యి కేసుల నమోదు వరకు వెళ్లిపోగా.. తెలంగాణలో అంత జోరు కనిపించని పరిస్థితి. అయితే.. ఇప్పుడు ఉన్నట్లుగా ఉంటే మాత్రం.. రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలు ఖాయమంటున్నారు.
అందుకు తగ్గట్లే తాజాగా సీఎం కేసీఆర్ కలల పంటగా చెప్పే యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఒక్కసారిగా బద్ధలైన కోవిడ్ పుట్ట హడలెత్తిస్తోంది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఆర్చకులతో పాటు .. దేవాలయ అధికారి.. సిబ్బందికి పాజిటివ్ కావటం టెన్షన్ పుట్టిస్తోంది. ఇటీవల భారీగా జరిగిన స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలకు భక్తులు సైతం పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇటీవల యాదాద్రిలో పని చేసే సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
దీంతో.. యాదాద్రి ఆలయంలో పని చేసేవారు ఒక్కొక్కరుగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. శనివారం అలా పరీక్షలు చేయించుకున్న వారిలో 30 మందికి పాజిటివ్ అని తేలటంతో షాక్ తిన్న పరిస్థితి. దీంతో.. ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆలయ పరిసరాలు.. క్యూలైన్లు.. వివిధ సెక్షన్ కార్యాలయాల్ని శానిటైజ్ చేశారు. ఆలయ పరిసరాల్ని పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు.
తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో స్వామివారికి నిర్వహించే ఆర్జిత సేవల్ని మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నిత్య పూజలన్నింటిని పరిమిత సంఖ్యలో నిర్వహించనున్నారు. అంతేకాదు.. జీయర్ కుటీర్ లో రోజూ నిర్వహించే అన్నదానాన్ని సైతం మూడు రోజుల పాటు బంద్ చేసినట్లు చెప్పారు.
క్షేత్రానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం అమలు చేయాలని చెబుతున్నారు. ఇంతా చేస్తే.. క్షేత్రంలో స్వామి వారి లఘు దర్శనం మాత్రమే కల్పించనున్నారు. యాదాద్రి ఆలయంలోని సిబ్బంది పెద్ద ఎత్తున పాజిటివ్ కావటంతో.. ఇటీవల ఆలయాన్ని దర్శించుకున్న వారందరికి కరోనా ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.