మహమ్మారి సెకండ్ వేవ్ ఎంతలా విరుచుకుపడుతుందో చూస్తున్నదే. బడాయిలు చెప్పే ప్రజా ప్రభుత్వాలు.. విరుచుకుపడే విపత్తు వేళ.. ఎలా చేతులు ఎత్తేస్తాయో? ప్రజల ప్రాణాలు పూచికపుల్లలతో సమానమన్నట్లు ఎలా వ్యవహరిస్తాయో? అందరి అనుభవంలోకి వస్తోంది. కరోనా మరణాల్లో అత్యధికం సరైన సమయంలో.. సరైన రీతిలో వైద్య సాయం అందకపోవటం కూడా ఒక కారణం. ప్రైవేటు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీవ్రమైన బెడ్ల కొరత నెలకొందన్న విషయం తెలిసిందే.
ప్రైవేటుతో పోలిస్తే.. ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీలు ఉన్నట్లు చెబుతున్నప్పటికి.. వాస్తవంలో అలాంటి పరిస్థితి లేదన్న మాట వినిపిస్తోంది. తాజా అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏకంగా 7393 బెడ్లు ఖాళీగా ఉన్నట్లుగా వెల్లడించారు. ఇందులో 2470 ఆక్సిజన్ బెడ్లు కాగా.. 600 వెంటిలేటర్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటున్నారు.
కరోనా రోగులకు వైద్య సాయం అందించేందుకు వీలుగా మందులు.. వైద్య బృందాలు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నారని చెబుతున్నారు. విన్నంతనే.. ఇన్ని బెడ్లా? అనిపిస్తున్నప్పటికి.. వాస్తవంలో మాత్రం అలాంటి పరిస్థితి లేని దుస్థితి. ప్రభుత్వం చెబుతున్న లెక్క ప్రకారం.. ఆయా ఆసుపత్రుల్లో బెడ్ల లెక్కల్ని చూపిస్తున్నా.. ఎవరైనా చేరటానికి వెళితే.. అంత తీవ్రమైన కేసు కాదని.. హోం ఐసోలేషన్ సరిపోతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
దీంతో.. వారు వేరే ఆసుపత్రులకు వెళుతున్నారు. ఇలా.. లెక్కల్లో చూపించేందుకు పెద్ద ఎత్తున ఖాళీలు చూపిస్తున్నా.. అవేమీ ప్రాక్టికల్ గా మాత్రం ప్రజలకు అందుబాటులోకి రావటం లేదన్న విమర్శ వినిపిస్తోంది. ఈ ఆరోపణపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని.. ఆడ్మిషన్లకు సంబంధించి పాజిటివ్ రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిష్కరించాల్సిన పని ఉంది.