కరోనాను ఖతం చేయటానికి రూపొందించిన వ్యాక్సిన్ కొన్ని దేశాల్లో ఇప్పటికే వచ్చేయటం.. పలువురికి ఇచ్చేయటం తెలిసిందే. హమ్మయ్య.. కరోనా టార్చర్ కు శుభంకార్డు పడుతున్నట్లే అని ఊపిరి పీల్చుకునేంతలో.. యూకే స్ట్రెయిన్ కొత్త ట్విస్టు ఇవ్వటం.. కరోనా తో పోలిస్తే 60-70 శాతం వేగంతో వ్యాప్తి చెందటంతో.. సీన్ మొదటికి వచ్చినట్లైంది. మళ్లీ పలు దేశాల్లో లాక్ డౌన్ లతో పాటు.. కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు.
టీకా వచ్చేశాక.. ఈ వ్యాప్తి ఇంత వేగంగా సాగుతుంది కదా? టీకా దీని మీద ప్రభావం చూపలేదా? అన్నది క్వశ్చన్ గా మారింది. దీనిపై మన దేశానికి చెందిన ప్రముఖులు ఏమంటున్నారు? వ్యాక్సిన్ వర్సెస్ యూకే స్ట్రెయిన్ లో ఎవరిది పైచేయి అన్నది చర్చగా మారింది. దీనిపై తాజాగా వెలువడుతున్న అభిప్రాయాల ప్రకారం.. కొత్త స్ట్రెయిన్ అంతు చూసే సత్తా వ్యాక్సిన్ కు ఉందని.. టీకాను డామినేట్ చేసేంత సీన్ లేదని స్పష్టం చేస్తున్నారు.
అందుకే.. ఎవరూ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు కె. విజయరాఘవన్ భరోసా ఇస్తున్నారు. టీకా వర్సెస్ వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారాన్ని ఆయన షేర్ చేస్తూ ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ వైరస్ పై ఉన్న స్పైక్ ప్రోటీన్ (అదేనండి కొమ్ములు) లక్ష్యంగా చేసుకొని పని చేస్తాయి. వ్యాక్సిన్ మనిషి శరీరంలోకి ఎంటర్ అయిన వెంటనే పెద్ద ఎత్తున రోగ నిరోధకాల్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి.. అవి వైరస్ ను అడ్డుకుంటాయి.
ఇప్పుడు వచ్చిన యూకే స్ట్రెయిన్ లో వ్యాక్సిన్ ను డామినేట్ చేసేంత స్థాయిలో లేదని చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్ కొమ్ముల్లో 18 మార్పులు రాగా.. అందులో 8 చాలా ముఖ్యమైనవని.. అందులో ఒక దాన్లో వచ్చిన మార్పు పుణ్యమా అని.. వైరస్ వ్యాప్తి మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ఈ ఒక్క మార్పు కారణంగా మన సెల్ లోకి చొరబడిన వైరస్ బలంగా అంటిపెట్టుకోవటం వల్ల.. ఒకరి నుంచి మరొకరికి సంక్రమణ మరింత వేగంతో వెళుతున్నట్లుగా వివరించారు. యూకే వైరస్ దేశంలో వ్యాప్తి చెందిందనటానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని.. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది కాబట్టి.. కొత్త స్ట్రెయిన్ గురించి అట్టే ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేస్తున్నారు.