కొత్తవాళ్లు ఈ కశ్మీర్ బజార్ ఏమిటని కాస్తంత చిత్రంగా చూస్తారు కానీ.. ఢిల్లీ.. అగ్రాలో మాత్రం ఇదే పదాన్ని వాడితే.. అదో రకంగా చూడటం ఖాయం. రెడ్ లైట్ ఏరియాకు నిలువెత్తు నిదర్శనంగా ఉండే ఈ బజార్లోకి పోలీసులు సైతం అడుగు పెట్టలేరని చెబుతారు.
ఇరుకైన వీధులతో పాటు.. పోలీసుల్ని సైతం అవసరానికి తగినట్లుగా హతమార్చేందుకు ఏ మాత్రం వెనుకాడని ఈ డేంజరస్ ప్లేస్ లోకి అడుగు పెట్టటమే కాదు.. అక్కడి వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న దాదాపు 20 మంది బాలికలకు కొత్త జీవితాన్ని ఇచ్చారు ఐజీ అర్కే మిశ్రా. ఆయన చేపట్టిన ఆపరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కాశ్మీర్ బజార్లో పోలీసులు రెయిడ్ చేయటం సంచలనంగా మారటమే కాదు.. మిగిలిన వారు ఉలిక్కిపడేలా చేయటం గమనార్హం. ఈ ఉదంతం సినిమాటిక్ గా ఉండటం గమనార్హం.
దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ముంబయికి చెందిన ఒక అమ్మాయిని గుర్తు తెలియనివ్యక్తులు కిడ్నాప్ చేసి.. అగ్రాలోని కాశ్మీర్ బజార్లో అమ్మేశారు. తన వద్దకు విటుడిగా వచ్చిన ఒక గూండాకు తన కష్టాన్ని చెప్పుకొని వాపోయింది. దీంతో.. సదరు గూండా ప్లాన్ వేసి.. తన అనుచరుల్ని వేర్వేరుగా వ్యభిచార గృహంలో విటులుగా వచ్చిపోతూ.. వారికి అలవాటు అయ్యాక.. ఒక రోజు తన అనుచరుల సాయంతో సదరు బాధితురాలిని బయటకు తీసుకురాగలిగాడు.
ఆ నరక కూపం నుంచి బయటకు వచ్చిన ఆమ తన కుటుంబ సభ్యులకు తన గోడు వెళ్లగక్కుకుంది. అనంతరం ఆమె పోలీసుల్ని ఆశ్రయించి.. కాశ్మీర్ బజార్లో జరిగే భారీ వ్యభిచార రాకెట్ గురించి చెప్పి.. తనకు లాగే నరకకూపంలో పలువురు అమ్మాయిలు మగ్గుతున్నారని.. వారిని విముక్తి చేయాలంటూ ఆమె వేడుకుంది.
దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. కేవలం 15 నిమిషాల వ్యవధిలో కాశ్మీర్ బజార్ లో ఆపరేషన్ నిర్వహించి.. దాదాపు 20 మంది అమ్మాయిల్ని కాపాడారు. వ్యభిచార ముఠాలు మేలుకొని.. స్పందించే లోపే.. పోలీసులు తమ దారిన తాము పోవటం.. చేయాల్సిన డ్యామేజ్ చేసేయటం ఇప్పుడ ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఒక గూండా.. ఒక పోలీసు ఉన్నతాధికారి చేసిన సాహసకార్యం ఇప్పుడు ఢిల్లీ.. అగ్రా ప్రాంతంలో పెను సంచలనానికి దారి తీసింది. చేయాలన్న తపన ఉండాలే కానీ.. ఏమైనా చేయొచ్చన్న విషయం మరోసారి రుజువైంది.