తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఆంగ్ల పత్రిక దక్కన్ క్రానికల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఓటుకు నోటు కేసులో కీలక సాక్ష్యాన్ని సంపాదించింది. తాజాగా ఆ పత్రిక మొదటి పేజీలో దీన్ని ప్రచురించింది. ఇది జరిగి మూడేళ్ల తర్వాత డెక్కన్ క్రానికల్ తాజాగా ఈ కథనాన్ని ప్రచురించడం సంచలనంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లోనే తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో 11 నిమిషాల మరో వీడియో టేపు తమకు దొరికిందని.. అందులోని వివరాలను ప్రచురించింది. ఈ 11 నిమిషాల వీడియోలో రేవంత్ రెడ్డి - స్టీఫెన్ సన్ - సెబాస్టియన్ ల మధ్య జరిగిన సంభాషణలున్నాయి. ఈ వీడియోలో చాలాసార్లు బాబు అన్న పదాన్ని ఈ ముగ్గురు వాడడం గమనార్హం. ముందుగా రేవంత్ రెడ్డి సంభాషణ కొనసాగింది. తెలంగాణలో ఇబ్బంది వస్తే ఏపీలో ఎమ్మెల్యేగా చంద్రబాబు అవకాశం ఇస్తారని రేవంత్.. స్టీఫెన్ సన్ కు హామీ ఇచ్చినట్టు వీడియోలో ఉందని పత్రిక పేర్కొంది. ఈ విషయంలో చంద్రబాబును ఒప్పిస్తానని రేవంత్ అన్నట్టు పత్రిక తెలిపింది.
చంద్రబాబు స్టీఫెన్ సన్ ను కొనేందుకు మూడున్నర కోట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించారని.. కానీ తానే రూ.5కోట్లకు పెంచానని స్టీఫెన్ సన్ తో సెబాస్టియన్ చెప్పినట్టు పత్రికలో వివరించారు.
కేసీఆర్ సర్కారు చంద్రబాబు మోసాన్ని బయటపెట్టేందుకు స్టీఫెన్ సన్ ను పావుగా వాడి ఓటుకు నోటు స్కాంను అప్పట్లో బయటపెట్టడం దేశవ్యాప్తంగా సంచలనమైంది.. ఈ వీడియోలతో చంద్రబాబు తీవ్ర ఇరకాటం పడ్డారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ సదురు మొత్తం వీడియో లీక్ కావడం.. దాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలోనే ఈ వీడియో రిలీజ్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.
Full View