బ్యూటీషియన్ శిరీష మృతిలో పోలీసులు మరింత వివరణ ఇచ్చారు. శిరీష మృతిలో నిందితుల రెండో రోజుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో డీసీపీ వెంకటేశ్వరరావు తాజాగా మీడియాతో మాట్లాడారు. శిరీష మృతి విషయంలో తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న క్వార్టర్ లోకి తాము వెళ్లలేదని - బయటి నుంచే మొత్తం చూసి వచ్చేశామని తెలిపారు. ఎస్సై సూసైడ్ చేసుకున్న క్వార్టర్ చుట్టూ భారీ పోలీస్ బందోబస్త్ ఉందని, అందుకే అక్కడ పరిశీలన చేయడం వీలు కాలేదని డీసీపీ మీడియాకు వెల్లడించారు. కాగా శిరీష ఆత్మహత్య చేసుకున్న గదిలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటికి ఎక్కడా కనెక్టివిటీ లేకపోవడం ఆ ఫుటేజీలేవీ లభ్యం కాలేదని తెలిపారు.
పూర్తిస్థాయి దర్యాప్తులో భాగంఆ శిరీష కేసులో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశామని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. కుకునూరుపల్లి వెళ్లి వచ్చిన రూట్‌ని నిందితులతో కలిసి అనలైజ్ చేశామని, కుకునూరుపల్లికి వెళ్లటానికి ముందు వారు కప్ప కాఫీషాపులో భేటీ అయ్యారని డీసీపీ వివరించారు. అక్కడినుంచి బంజారాహిల్స్ పీఎస్ కు వచ్చి ఎస్సైతో 5 నిమిషాలు మాట్లాడారని, ఆ తర్వాత వారు బంజారాహిల్స్ లో మద్యం - రాయదుర్గంలో ఆహారం తీసుకున్నారని డీసీపీ చెప్పారు. రాయదుర్గం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కుకునూరుపల్లి వెళ్లారని - అక్కడి నుంచి అర్థరాత్రి శామీర్ పేట అల్వాల్ మీదుగా షేక్ పేట్ చేరుకున్నట్లు తెలిపారు.
మరోవైపు బ్యుటిషియన్ శిరీష కేసులో ఏ1 - ఏ2 నిందితులుగా ఉన్న రాజీవ్ - శ్రవణ్ లను ఉస్మానియాలో వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం ఈరోజు ఉదయం నాంపల్లి కోర్టుకు తరలించారు. కాగా రాజీవ్ - శ్రవణ్ ల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. నాంపల్లి కోర్టు వారిరువురికి ఈనెల 30 వరకూ రిమాండ్ విధించడంతో తిరిగి జైలుకు తరలించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/