ఖరీదైన భవనాలు.. తెల్లతోలును చూసిన చాలామంది.. విదేశాల్లో జీవితం ఎంతో బాగుటుందని తెగ ఫీల్ అవుతుంటారు. ఆకాశానికి తాకే భవనాల్ని చూపించటం.. అత్యాధునిక వస్త్రధారణతో పాటు.. విలావంతంగా వారు బతికేస్తుంటారన్న భ్రమలో ఉండేవారెందరో. అయితే.. అలాంటివి మనసులో ఉంటే.. తాజా ఉదంతం గురించి వింటే.. అమెరికా మీద విర్తక్తి మాత్రమే కాదు.. వామ్మో.. వద్దంటే వద్దనేయటం ఖాయం.
అమెరికాలో సంపన్నులకు ఎలా అయితే కొదవ లేదో.. నిరుపేదలకు తక్కువేం ఉండరు. అన్నింటికిమించిన అమెరికాలో ఉన్న సమస్య.. వృద్ధాప్యంలో ఉన్న వారికి మాత్రం కాస్తంత నరకమే. ఇక.. వారికి పేదరికం తోడైతే.. వారి గోస ఎవరికి పట్టని పరిస్థితి. ఇంటికి ఇంటికి మధ్య దూరంగా ఉండటం.. ఒకరి గురించి మరొకరికి పట్టకపోవటం లాంటి కారణాలతో ఎవరి బతుకులు వారు బతికేస్తుంటారు. తాజాగా వెలుగుచూసిన ఉదంతం గురించి వింటే నోట మాట రాదు సరికదా.. కడుపులో దేవినట్లుగా ఉండే ఈ విషాద ఘటనలోకి వెళితే..
అమెరికాలోని డెట్రాయిట్ నగరంలోని ఒక ఇంట్లో నివసిస్తుంటారు 80 ఏళ్ల శాలీ హనీచెక్. ఇంత పెద్ద వయసులో ఆమె ఒక్కతే ఉంటోంది. ఆమెకు సంబంధించి పినతల్లి కుమార్తె లిండా కజ్మూ ఆమెను చూసేందుకు అప్పుడప్పడు చూసేందుకు వస్తుంటారు. ఆమె నివాసానికి ఇరుగుపొరుగువారు లేకపోవటంతో ఆమెకు సంబంధించిన వివరాలు ఎవరికి పెద్దగా తెలీవు. అప్పుడప్పుడు ఫోన్లు చేయటం ద్వారా ఆమె క్షేమ సమాచారం తెలిసే పరిస్థితి. పేదరికంతో పాటు.. అనారోగ్యంతో ఉండటంతో ఆమెను ఓల్డేజ్ హోంలో చేర్చాలనుకున్నారు. కానీ.. అందుకు ఆమె ససేమిరా అనేవారు. పెంపుడు కుక్కను విడిచిపెట్టటం ఇష్టం లేక ఆమె ఒక్కతే ఉండేందుకు ఇష్టపడేవారు.
ఇదిలా ఉంటే.. గడిచిన కొన్ని రోజులుగా ఫోన్ కాల్స్ కు స్పందించకపోవటంతో లిండాకు డౌట్ వచ్చింది. తలుపు ఎంత కొట్టినా సమాధానం రాకపోవటంతో.. తలుపులు బద్దలు కొట్టారు. ఇల్లంతా ఖాళీగా ఉండగా.. వంట గది నుంచి తీవ్రమైన దుర్గంధం వస్తుండటంతో అటుగా వెళ్లగా.. అక్కడ కుర్చీలో ఆస్థిపంజరాన్ని చూసి షాక్ తింది. పుర్రెకు ఉన్న జట్టు ఉండగా.. ముఖం సగం వరకూ కొరికేసినట్లు ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి.. ఎముకల గూడును స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిర్వహించారు. ఇంట్లో మరో గదిలో పెంపుడు కుక్క తీవ్ర అస్వస్థతో పడిపోయి ఉంది. వైద్యుల రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఆమెది సహజ మరణమని.. ఆమె శరీరాన్ని పెంపుడు కుక్క.. ఎలుకలు కొరికేసి.. తినేసినట్లుగా గుర్తించారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.