డెడ్ లైన్ ముగిసింది.. నిమ్మగడ్డ స్టెప్ ఏంటి?

Update: 2021-01-23 13:36 GMT
ఏపీలో నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పట్టుబడుతుండగా.. జరగనివ్వమని ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. దీంతోనే ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ వేసినా కూడా సహకరించమని అధికారులు తేల్చిచెప్పారు.

ఈ క్రమంలోనే ఏపీ అధికారులు తనతో భేటికి రావాలని నిమ్మగడ్డ పెట్టిన వీడియో కాన్ఫరెన్స్ డెడ్ లైన్ ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్లు, అధికారులు ఎవరూ హాజరు కాలేదు. దీంతో నిమ్మగడ్డ రమేశ్ సాయంత్రం 5 గంటలకు డెడ్ లైన్ పెట్టారు.

అయితే 5 గంటలకు కూడా ఏపీ ప్రభుత్వ అధికారులతో ఆయనతో కాంటాక్ట్ కాలేదు. దీంతో నిమ్మగడ్డ ఏం చర్యలు తీసుకోబోతారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పుడు నిమ్మగడ్డ చుట్టూనే రాజకీయాలు ముడిపడి ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అయితే తాజా పరిణామాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సోమవారం గవర్నర్ ను కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. అధికారుల గైర్హాజరు, కోర్టు తీర్పు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఏం చేయాలనే దానిపై చర్చించనున్నట్లు సమాచారం. సోమవారం వరకు దీనిపై క్లారిటీ రానుంది. 
Tags:    

Similar News