పోసాని నుంచి ప్రాణహాని ఉంది... ఫిర్యాదు చేసిన జనసేన కార్యకర్త!

Update: 2021-10-11 15:30 GMT
దర్శకుడు పోసాని కృష్ణమురళీ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మధ్య వివాదం రోజుకొక మలుపు తిరుగుతోంది. పవన్ కల్యాణ్‌పై పోసాని చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపాయి. ఈ నేపథ్యంలోన పవన్ అభిమానులు రెచ్చిపోయారు. తనను పవన్ అభిమానులు దూషిస్తూ మెసేజ్‌లు పెడుతున్నారని పోసానిని ఆరోపణలు చేశారు. అంతేకాదు పవన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దూషణల పర్వం తర్వాత వాతవరణం ఒక్కసారిగా వేడెక్కింది. మీడియా సమావేశంలో ఉన్న పోసానిని అడ్డుకునేందుకు జనసేన కార్యకర్తలు యత్నించారు. ఆ తర్వాత పోలీసుల సాయంలో పోసాని ఇంటికెళ్లారు. ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో రాళ్లతో దాడి చేశారు. పోసానిని దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించారు. దీంతో పవన్ కల్యాణ్ నుంచి, ఆయన అభిమానుల నుంచి ప్రాణహాని ఉందని పోసాని ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారం తెలంగాణకే పరిమితమైంది. ఇప్పుడు ఏపీలో పోసాని వర్సెస్ జనసేన కార్యకర్తలుగా మారుతోంది. పోసాని కృష్ణమురళీ నుంచి తనకు ప్రాణహాని ఉందని జనసేన కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన జనసేన కార్యకర్త రాజశేఖర్, పోసానితో పాటు వైసీపీ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని రాజశేఖర్ సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన చేపట్టిన సోషల్ మీడియా ఉద్యమంతో పాటు శ్రమదానం కార్యక్రమాల్లో రాజశేఖర్ చురుగ్గా పాల్గొన్నారు. అలాగే అదే సమయంలో పోసాని వ్యాఖ్యలపై పలువురు కార్యకర్తలు విమర్శలు చేశారు. ఇప్పటివరకు పోసాని వర్సెస్ జనసేన కార్యకర్తలుగా ఈ వ్యవహారం నడిచింది. ఇప్పుడు పోసానితో పాటు వైసీపీ నేతలపై రాజశేఖర్ ఫిర్యాదు చేయడంతో రాజకీయ రంగు పులుముకుంటోంది.
Tags:    

Similar News