అమ్మ ఆత్మ క్షోభించేలా త‌మిళ‌నాడు ప‌రిణామాలు

Update: 2017-03-18 04:59 GMT
అన్నాడీఎంకే అధినేత‌ - తమిళనాడు దివంగ‌త సీఎం జయలలిత మరణానంతరం రాజకీయ దృశ్యం విచిత్రంగా మారిపోతోంది. అధికార అన్నాడీఎంకేలో అమ్మ నెచ్చెలి శశికళ - అమ్మ అనుంగ అనుచ‌రుడు పన్నీర్‌ సెల్వం మధ్య వారసత్వ పోటీ కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రేసులోకి జయ మేనకోడలు ఎంట్రీ ఇచ్చి ఎంజీఆర్ అమ్మ దీప పెరవై పేరిట రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఆమె భర్త మాధవన్ కూడా రేసులో వ‌చ్చేశారు. అంతే కాదు తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.

జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీప భ‌ర్త మాధ‌వ‌న్ కొందరు మద్దతుదారులతో కలిసి మెరీనా బీచ్‌ లోని జయలలిత మెమోరియల్‌ ను సందర్శించిన అనంతరం ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. తన భార్య ఏర్పరిచిన సంస్థ దుష్టశక్తుల చేతుల్లో ఉందన్న ఆయన త్వరలోనే తన పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు. దుష్టశక్తులను ఎందుకు ఎదుర్కోవడం లేదన్న ప్రశ్నకు- అదంతా దీప నిర్ణయించుకోవాలి అని బదులిచ్చారు.  దీపది సమాఖ్యమాత్రమేనని, తాను స్థాపించబోయేది రాజకీయ పార్టీ అని మాధవన్‌ తెలిపారు. రాజకీయ భేదాలు తలెత్తినప్పటికీ తమ వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్య ఉండదని, అదే ఇంటిలో ఉంటామని చెప్పారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించి తన పార్టీ క్యాడర్‌ ను సంప్రదించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News