సభ్య సమాజం తలదించుకునేలా.. సిగ్గుతో చితికిపోయేలా వ్యవహరించిన మానవమృగాలకు జీవించే అవకాశం లేదని.. వారికి ఉరి వేయటమే సబబు అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు ఇవ్వటం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల కిందట (2012 డిసెంబరు) ఢిల్లీకి చెందిన పారా మెడికల్ విద్యార్థిని నిర్బయను కదిలే బస్సులో అత్యంత దారుణంగా..పాశవికంగా అత్యాచారం చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది.ఈ దారుణ నేరంపై దేశం యావత్తు కదిలిపోయింది. ఈ కేసులో దోషులుగా తేలిన వారందరికి ఉరికి మినహా మరెలాంటి శిక్షవేసినా తక్కువే అవుతుందన్న మాట దేశ ప్రజల నోట వినిపించింది.
అయితే.. దోషుల్లో ఒకరు బాలనేరస్తుడు కావటంతో.. అతడ్ని జువైనల్ హోంకు తరలించారు. జైలు జీవితం పూర్తి అయిన తర్వాత అతన్నిఒక ఎన్జీవో ఆధ్వర్యంలో అతనికి ఉపాధి కల్పించారు. ఆ విషయాన్ని పక్కన పెడితే.. నిర్భయ ఉదంతంలో దోషులుగా తేలిన నలుగురు నరరూప రాక్షసులకు 2013లో కోర్టు ఉరి విదించింది. దీనిపై అప్పీలుకు వెళ్లిన వారికి.. ఉరిశిక్షే సబబు అంటూ ముగ్గురు సభ్యులున్న సుప్రీంకోర్టు బెంచ్ ఏకాభిప్రాయంతో తన తీర్పును వెల్లడించింది.
దీంతో.. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురు నిందితులు అక్షయ్ ఠాకూర్.. వినయ్ శర్మ.. పవన్ గుప్తా.. ముఖేష్ లకు ఉరి తప్పదని తేల్చేసింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే కోర్టులోని వారు చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో దోషుల తరఫున వాదనలు వినిపించిన డిఫెన్స్ లాయర్ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నవారంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రక్తం మరిగేలా ఉన్న డిఫెన్స్ లాయర్ మాటల్ని చూస్తే.. ఒక లాయర్ నోటి నుంచి ఆ తరహా వ్యాఖ్యలు రావటం ఏమిటన్న భావన కలగటం ఖాయం.
నిర్భయ దోషులకు ఉరిని సుప్రీం కన్ఫర్మ్ చేయటం ద్వారా మానవహక్కులు హత్యకు గురైనట్లుగా డిఫెన్స్ లాయర్ ఎపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీర్పు అనంతరం కోర్టు బయట మీడియాతో మాట్లాడిన సందర్బంగా తాజా తీర్పు మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతానికి పూర్తి విరుద్దమన్నారు. సమాజానికి ఏదో చెప్పాలని ఆరాటపడి ఇలాంటి శిక్షలు విధించటం సరికాదన్నారు. తీర్పుపై త్వరలో రివ్యూ పిటీషన్ వేస్తానన్న ఆయన మాటల్ని వింటే తీవ్ర ఆగ్రహం రావటమే కాదు.. తన ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఇలాంటి దారుణ అనుభవం ఎదురైనప్పుడు కూడా ఇంతేలాంటి అహింసాయుత మాటల్నే చెబుతారా? అన్నది ప్రశ్న. ఎవరో ఒక విలేకరి ఈ ప్రశ్న అడిగి పుణ్యం కట్టుకుంటే.. అయ్యగారి అహింస ఎంతో తెలిసే వీలుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/