హమ్మయ్యా.. కేజ్రీకి కరోనా లేదంట

Update: 2020-06-09 17:48 GMT
నిజంగానే ఈ వార్త చాలా ప్రాముఖ్యమైనదే. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ఊరటనిచ్చే వార్తే. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా సోకలేదట. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వైద్య పరీక్షల నివేదిక తేల్చేసింది. కేజ్రీకి కరోనా మహమ్మారి సోకలేదని తేల్చేసింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ... దేశ రాజదాని ఢిల్లీలో కూడా ఈ వైరస్ విస్తృతి ఓ రేంజిలో సాగుతోంది. అలాంటి తరుణంలో సాక్షాత్తు ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు గొంతు నొప్పి జ్వరం రావడంతో ఢిల్లీ ప్రజలతో పాటు ఆప్ సర్కారు ఉలిక్కిపడింది.

తనకు జ్వరం, గొంతు నొప్పి ప్రారంభమైన వెంటనే దాదాపుగా సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లినట్లుగా ఇంటికే పరిమితమైన కేజ్రీ... మంగళవారం ఉదయమే వైద్య పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కేజ్రీ నుంచి శాంపిళ్లను సేకరించిన వైద్యులు.. వాటిని కరోనా నిర్ధారిత పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు. ఈ పరీక్షల్లో కేజ్రీకి కరోనా సోకలేదని తేలిపోయింది. దీంతో ఆప్ సర్కారుతో పాటు ఢిల్లీ ప్రజలు ఊపిిరి పీల్చుకున్నారు.

గడచిన మూడు రోజులుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉన్నారు. అన్ని అధికారిక, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మంగళవారం ఉదయం ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఐతే రిపోర్టులో నెగెటివ్ రావడంతో అధికార యంత్రాంగం, కేజ్రీవాల్ కుటుంబం ఊపిరిపీల్చుకుంది.
Tags:    

Similar News