సామాన్యుడి పార్టీ అని చెబుతూ.. నీతికి నిజాయితీకి మారుపేరుగా చెప్పుకునే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. తన మంత్రివర్గంలోని మంత్రిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయటం ప్రభుత్వానికి ఒక షాక్‌గా మారింది.
తన విద్యార్హతకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు జత చేసిన ఉదంతంలో ఢిల్లీ రాష్ట్ర న్యాయశాఖామంత్రి జితేంద్రసింగ్ తోమర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సమయంలో.. తోమర్ దాఖలు చేసిన విద్యార్హతలకు సంబంధించి వివరాల్లో తప్పుడు సమాచారం అందించారన్నది ప్రధాన ఆరోపణ.
ఒక విశ్వవిద్యాలయం నుంచి తాను న్యాయవాద పట్టాను పొందినట్లుగా ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే.. సదరు విశ్వవిద్యాలయంలో ఆయన చదవలేదన్న విషయం వెల్లడి కావటం.. తప్పుడు విద్యార్హతలతో ఆయన తన నామినేషన్ దాఖలు చేశారని తేలటంతో ఆయనపై కేసు నమోదైంది. తాజాగా.. ఆయన్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయశాఖామంత్రే అన్యాయం చేయటం కాస్తంత చిత్రమే కదూ.