ప్రేయసిని 35 ముక్కలు చేసిన ఘటన.. అగర్‌బత్తీలు, అమెరికా సెంట్, అమెరికన్ క్రైమ్ షో!
ఢిల్లీలో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని యువకుడు అత్యంత క్రూరంగా 35 ముక్కలుగా నరికి హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య చేసిన ఆరు నెలల తర్వాత ఈ ఉదంతం వెలుగులోకి రావడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. కేసు వివరాలను ఢిల్లీ సౌత్ పోలీసు ఇన్‌ఛార్జ్ అంకిత్ చౌహాన్ వెల్లడించారు.
నిందితుడు అప్తాబ్ యువతిని 35 ముక్కలుగా నరికాక వాటిని ఫ్రిడ్జ్‌లో భద్రపరిచాడు. ముందుగా ఏ భాగాలు కుళ్లిపోతాయో యూట్యూబ్ చూసి తెలుసుకున్నాడు. కుళ్లిపోయే భాగాలను ముందుగా తీసువెళ్లి ఢిల్లీ అంతటా పారేసి వచ్చాడు.
తన ప్లాట్ పక్కన ఉండే మిగతా ప్లాట్‌లవారికి అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడు అప్తాబ్ నిత్యం మంచి సువాసననిచ్చే అగర్‌బత్తీలను వెలిగించేవాడని తేలింది. దీంతోపాటు అమెరికన్ కంపెనీ సెంట్ ఒకటి రూమ్ అంతా కొట్టేవాడని.. రూమ్ ఫ్రెషనర్లు వినియోగించేవాడని స్పష్టమైంది.
దీంతో దుర్వాసన రాకుండా జాగ్రత్తపడ్డాడు. తనతో సహజీవనం చేస్తున్న యువతిని నరిక చంపాక ఆ 35 ముక్కలను భద్రపరచడం కోసమే ప్రత్యేకంగా 300 లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్రిజ్ కొన్నాడు.
స్వతహాగా ఆప్తాబ్ ట్రైన్డ్ చెఫ్ కావడంతో ఆమెను 35 ముక్కలుగా సరిగ్గా నరికాడు. ఇందుకు అమెరికన్ క్రైమ్ షో... 'డెక్స్టర్' నుంచి ప్రేరణ పొంది ఇంతటి కిరాతకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనికితోడు చెఫ్‌గా శిక్షణ పొందిన నిందితుడు మాంసం కత్తిని ఉపయోగించడంలో ప్రవీణుడని వెల్లడైంది.
హత్య చేసిన 18 రోజుల్లో వాటిని ఒక్కొక్కటిగా నగరంలోని మొహహ్రౌలీ అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా విసిరేశాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో బయటకు వచ్చి ముక్కలుగానరికిన శరీర భాగాలను పారేశాడు. అపార్ట్‌మెంట్ ఇరుగుపొరుగు వారికి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇంట్లో అగర్‌బత్తిలు వెలిగించినట్లు అంగీకరించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.