టిక్కెట్ ఇవ్వకపోతే 10 నిమిషాల్లో ఆత్మహత్య

Update: 2018-09-08 09:11 GMT
హుజూర్ నగర్ నియోజకవర్గ టీఆర్ ఎస్ ఇన్ చార్జి.. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి దాసోజు శంకరమ్మ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. తనను కాదని టీఆర్ ఎస్ పార్టీ హుజూర్ నగర్ టికెట్ ను మరొకరికి ఇస్తే.. 10 నిమిషాల్లోనే తన ప్రాణం పోతుందని హెచ్చరించారు. ఆత్మహత్య చేసుకుంటానని ఆమె వాపోయారు.

తనకు టిక్కెట్ ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ - మంత్రి కేటీఆర్ లు హామీ ఇచ్చారని.. ఇచ్చిన మాటను నిలుపుకుంటారని ఆశిస్తున్నానని ఆమె తెలిపారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ సైదులుకు ఇక్కడ టీఆర్ఎస్ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోందని.. అదే కనుక చేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు.

శంకరమ్మ 2014 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా ఆమెపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కింది స్థాయి నేతలు - కార్యకర్తలు కూడా ఆమెకు సీటు ఇస్తే ఓడిపోతామని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హోల్డ్ లో పెట్టారు.

మరోవైపు శంకరమ్మకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వీరాంజనేయులు - నాగు అనే ఇద్దరు యువకులు హైదరాబాద్ లోని రేడియో స్టేషన్ టవర్ ఎక్కి నిన్న హల్ చల్ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది.
    

Tags:    

Similar News