పెద్ద నోట్ల రద్దు అంటూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా ఎంత కచ్ఛితంగా అమలు అవుతుందన్న విషయం... తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం చూస్తేనే అర్థమవుతుంది. చిల్లర నోట్లు రాక.. కొత్త నోట్ల క్యూ తట్టుకోలేక.. చాలామంది చేతిలో ఉన్న డబ్బుల్ని ఆచితూచి ఖర్చు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అనుకోని అవసరం ఏదైనా ఏర్పడి.. పాత నోట్లను ఇస్తే.. తీసుకునేది లేదని తెగేసి చెబుతున్న వైనం చాలాచోట్ల కనిపిస్తోంది.
పాత నోట్ల రద్దు ప్రకటనతో పాటు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. వైద్యసేవల్ని వినియోగించుకునే వారు పాతనోట్లను తీసుకునే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ.. అలాంటి మినహాయింపుల్ని ఆసుపత్రులు.. మరికొన్ని అత్యవసర సేవల విభాగం వారు తీసుకోవటం లేదు. దీంతో.. సామాన్యుడు పడుతున్న ఇబ్బందులు రెట్టింపు అవుతున్నాయి. ఇలాంటి కష్టాలు సామాన్యులకే కాదు.. అసమాన్యులకు ఎదురు కావటంతో.. వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందన్నది పాలకులకు అర్థమయ్యే ఘటన ఒకటి తాజాగా బయటకు వచ్చింది.
కేంద్రమంత్రి సదానంద గౌడ్ సోదరుడు మంగళూరులోని కేఎంసీ ఆసుపత్రిలో మంగళవారం మరణించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అయిన ఖర్చు లెక్కను చూసి.. పాతనోట్లను ఇచ్చారు. కేంద్రమంత్రి ఇచ్చిన పాతనోట్లను తీసుకునేందుకు ఆసుపత్రి కౌంటర్లో ఉన్న వారు నో చెప్పేశారు. దీంతో.. దిక్కు తోచని ఆయన చివరకు చెక్కు ఇచ్చి బయటకు వచ్చేశారు. ఆసుపత్రుల్లో పాత నోట్లును తీసుకోవాల్సి ఉన్నా.. తీసుకోని వైనంపై చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారు. పవర్ చేతిలో ఉండే కేంద్రమంత్రికే ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే.. సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో కేంద్రమంత్రి వర్యులకు అర్థమై ఉంటుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/