తుపాకీ హింస ఉన్నా.. అమెరికాపై ప్రవాసుల మోజు తగ్గలేదు

Update: 2022-07-08 08:41 GMT
ఓ వ్యక్తి గన్ పట్టుకొని ఎదుటి వాళ్లను షూట్ చేసుకుంటూ పోవడం.. మనం సినిమాల్లోనే చూస్తాం.. కానీ ఇప్పుడు అమెరికాలో ఎక్కడ క్రైమ్ జరిగినా ఇది రియల్ గా కనిపిస్తోంది. అగ్రదేశంలో రోజురోజుకు గన్ కల్చర్ పెరిగిపోతోంది. నిత్యం పాకెట్లో గన్ పెట్టుకున్న వారు చిన్న చిన్న కారణాలకే దానికి పని చెబుతున్నారు. అప్పట్లో ఓ స్కూల్ లోని 19 మంది చిన్నారులతో పాటు 21 మందిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఇలాంటివి ఏడాదిలోపు 27 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోని మిగతా దేశాల కంటే అమెరికాలోనే ఎక్కువగా గన్స్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ దేశంలో ఇంతలా తుపాకులు వాడుతున్నా అమెరికాపై విదేశీయులు, ముఖ్యంగా ప్రవాస భారతీయులకు భయం తగ్గడం లేదు. ఆ దేశాన్ని వీడాలన్న ఆలోచనకు వారు రావడం లేదు. తుపాకీ వర్షంలోనూ అక్కడే బతికేందుకు మొగ్గు చూపుతున్నారు.

అమెరికన్లు ఒకదాని తర్వాత మరొకటి సామూహిక హత్యలకు గురవుతున్నారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఉవాల్డే స్కూల్ లో జరిగిన కాల్పులు భారీ షాక్ ఇచ్చాయి. అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందాలని ఆశపడుతున్న వారి కలలను ఇది చిదిమేసింది. స్వాతంత్ర్య దినోత్సవ కాల్పులు జరిగిన హైలాండ్ పార్క్‌కు కొద్ది దూరంలో ఉన్న ఇవాన్‌స్టన్ పట్టణంలో జూలై 4న జరిగిన మరో భయంకరమైన సంఘటనతో దేశం మేల్కొంది. ఇప్పుడు ఇల్లినాయిస్‌లోని హైలాండ్ పార్క్ లోనూ భారతీయులు టార్గెట్ గా దాడి జరిగింది. వాస్తవానికి భారతీయులు తమ 'అమెరికన్ డ్రీమ్' నెరవేర్చుకోవడానికి అగ్రరాజ్యానికి క్యూ కడుతున్నారు. అగ్రరాజ్యంలో జీవించాలనే ఆశతో తమ నివాసాలను ఏర్పరచుకున్నారు. అయినప్పటికీ స్థిరపడాలనే ఏకైక లక్ష్యంతో ఉన్న భారతీయులు ఎదుగుదలకు అడ్డుగా ఉన్న తుపాకీ హింసకు భయపడినట్లు కనిపించడం లేదు.

అమెరికన్ సమాజంలో అసహనం నెలకొంది. అందుకే చాలా మంది విచక్షణ కోల్పోయి కాల్పులకు తెగబడుతున్నారు.  మరీ ముఖ్యంగా అవి భారతీయులు ఉంటున్న ప్రాంతంలోనే జరుగుతున్నాయని తెలుసు. ఈరోజు వారి హృదయాలలో చాలా భయం ఉంది. ప్రస్తుతానికి  కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు. ఇంతలో ప్రజలు, హుక్ లేదా క్రూక్, అమెరికన్ సొసైటీలో భాగం కావాలని.. వారి పిల్లలు దేశ పౌరులుగా ఉండాలని కోరుకుంటున్నందున గ్రీన్ కార్డ్‌ల కోసం ఆర్భాటం కొనసాగుతోంది. బ్యాక్‌లాగ్‌లు..

సంవత్సరాల నిరీక్షణ ఉన్నప్పటికీ భారతీయులు అమెరికాలో స్థిరపడాలనే కోరికను వదులుకోవడం లేదు. సాధారణంగా భారతీయులు నివసించని ప్రాంతాల్లో కాల్పులు జరిగాయని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ముప్పు మరింత దగ్గరవుతున్నట్లు తాజా ఘటనలు తెలియజేస్తున్నాయి. ఇంత జరిగినా గ్రీన్‌కార్డు కోసం భారతీయ ఆశావహులు పెరుగుతూనే ఉన్నారు.
 
50 ఏళ్ల కిందట  అమెరికాలో 9 కోట్ల తుపాకులు ఉన్నట్లు సమాచారం. 2011 లెక్కల ప్రకారం..  88 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఎక్కువశాతం మరణాలు గన్ కాల్చడం వల్లే చనిపోయారని నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఈ గన్ కల్చర్ ను అమెరికా ఎందుకు ఆపలేదన్న ప్రశ్న  తలెత్తుతోంది. అంతేకాకుండా దీనిని కొనసాగించడానికి కొందరు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.

2018లో ప్రపంచ వ్యాప్తంగా 3.9 కోట్ల తుపాకులు ఉన్నాయని స్విట్జర్లాండ్లోని స్మాల్ అర్మ్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిపింది. ఇందులో అమెరికాలోనే ప్రతి వందమంది పౌరుల్లో 120 తుపాకులు కలిగి ఉన్నట్లు పేర్కొంది. అంటే ఇతర దేశాల్లో కంటే అమెరికాలోనే ఎక్కువ మంది గన్స్ కలిగి ఉన్నారు. అయితే ఈ రెండేళ్లలో వీటి సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోవడానికి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ) కారణమని తెలుస్తోంది. వీరు పెద్ద ఎత్తున డబ్బును కలిగి ఉన్నారని, రాజకీయ అండదండలతో వీరు గన్ మార్కెట్ ను విస్తృతం చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.  ఇంత తీవ్రంగా ఉన్నా.
Tags:    

Similar News