ఇంటి పెద్ద మీద యుద్ధం ప్రకటించి.. ఇంటి సభ్యులతో స్నేహం చేయటం సాధ్యమవుతుందా? ఇంటి పెద్దపై విమర్శలు చేసి.. చిన్నబుచ్చే మాటలన్న తర్వాత.. ఇంట్లోని వారు ఎవరైనా సదరు వ్యక్తితో కలిసి మెలిసి తిరిగేందుకు ఇష్టపడతారా? తాజా ఉదంతం కూడా ఇదే తరహాలోనిది. తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో ప్రధాని మోడీని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల సంగతి తెలిసిందే.
ఓవైపు మోడీపై విమర్శలు చేస్తూనే మరోవైపు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చెలిమి చేస్తామన్నట్లుగా ఉన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అన్నింటికి ప్రధానిని పిలవాల్సిన పనేం ఉందన్న కేసీఆర్ మాటలు బీజేపీ నేతల్ని గాయపర్చాయి. ప్రధానిని చిన్నబుచ్చేలా కేసీఆర్ మాట్లాడిన తర్వాత తమ పార్టీకి చెందిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎలా హాజరవుతారు? అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు.
మోడీపై కేసీఆర్ తాజా వ్యాఖ్యలతో తమకు.. వారికి మధ్య దూరం పెరిగిందన్న విషయం స్పష్టమైందని కమలనాథులు తేల్చి చెబుతున్నారు. ఇలాంటివేళ ఫడ్నవీస్ రావటం ఏ మాత్రం సరికాదని.. ఇప్పటికే ఆ విషయం పార్టీ అధినాయకత్వం నుంచి సందేశం వెళ్లినట్లుగా చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధానిని పిలవాలన్న మాటను తాము ఎప్పుడూ చెప్పలేదని.. కేసీఆర్ తనకు తానే ప్రకటించారని.. అలాంటిది ఇప్పుడు మాట మార్చి చిన్నబుచ్చేలా వ్యాఖ్యలు చేయటంపై కమలనాథులు గరంగరంగా ఉన్నారు.
ఫడ్నవీస్ ను తెలంగాణకు వెళ్లొద్దన్న విషయం తమ పార్టీ నాయకత్వం చెప్పేసిందన్న విషయాన్ని తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పేయటం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఫడ్నవీస్ రావొద్దని చెప్పేశామని.. ఆయన రారని ఆయన ఓపెన్ గా చెప్పేశారు. భారీ ఎత్తున నిర్వహించాలనుకున్న కార్యక్రమంలో పక్క రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి గైర్హాజరు కావటం కేసీఆర్ కు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పక తప్పదు.