టీడీపీకి దేవినేని రాజీనామా ..సీఎం సమక్షంలో వైసీపీలోకి ..

Update: 2019-11-14 11:26 GMT
ఏపీలో రాజకీయం రోజుకో మలుపుతో ముందుకు సాగుతుంది. కొన్ని రోజులుగా ఏపీలో వలసల రాజకీయం జోరందుకుంది. ఇటు బీజేపీ, అటు వైసీపీ..ఆపరేషన్ ఆకర్ష్‌ కు తెరలేపడంతో టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.  ఇప్పటికే రాజ్యసభ సభ్యులు సైకిల్ దిగి కమలం గూటికి చేరిపోయారు. ఈ మద్యే తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు. తాజాగా టీడీపీకి యువనేత దేవినేని అవినాష్ రాజీనామా చేశారు. తెలుగు యువత అధ్యక్ష పదవికి , టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఇవాళ ఉదయం తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు అవినాష్. రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు.

విజయవాడ లో సీనియర్ రాజకీయ నేతగా ఉన్న దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్.. విభజనకు ముందు కాంగ్రెస్‌ లో కొనసాగారు. 2014లో కూడా ఆ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత ఇద్దరూ కలిసి టీడీపీలో చేరారు. తర్వాత నెహ్రూ మరణంతో అవినాష్‌కు చంద్రబాబు ధైర్యం చెప్పారు. తెలుగు యువత బాధ్యతలు అప్పగించారు.. ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం టికెట్ కేటాయించారు. కానీ అవినాష్ కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత కూడా పార్టీలో బాగా యాక్టీవ్ గా పనిచేసారు. కానీ , పార్టీలో తనకి సముచితమైన స్థానం లేదు అని పార్టీకి రాజీనామా చేసారు.

అయన తన రాజీనామా పై స్పందిస్తూ .. మా నాన్న గారు నాకు చిన్నప్పటి నుండి  ఒక మాట చెప్పేవారు ..మన వ్యక్తిగత జీవితాల కన్నా , మనల్ని నమ్ముకుని ఉండే మనుషులు  ముఖ్యం .. వారి శ్రేయస్సు కోసం మనం  ఎలాంటి అడుగు అయినా తీసుకోక తప్పదు అని చెప్పారు .నేను ఎవరిని కించపరిచేలా కానీ , అవహేళన చేసేలా మాట్లాడే వ్యక్తిని కాదు. నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడడం నా స్వభావం అంటూ తెలిపాడు.  ఒక వ్యక్తి  నాయకుడు అవ్వాలంటే అది ప్రజలు కార్యకర్తలు అండతోనే సాధ్యం.  అదే నాయకుడు ఒక అడుగు వేశాడంటే అండగా ఉన్న కార్యకర్తలు ప్రజల శ్రేయస్సు కోసమే... నాకు మీరు ఇచ్చిన బలం మీకే చెందుతుంది తప్ప ఎన్నడూ నా లాభాపేక్ష ఉండదు. నాకు తెలిసింది నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కమిట్మెంట్ తో  పనిచేయడమే... ఒక అడుగు వేసేటప్పుడు ఎన్నో కారణాలు ఉంటాయి అదే విధంగా ఒక మాట అనేటప్పుడు అన్నీ ఆలోచించి అనాలి.

తెలుగుదేశం పార్టీ  కృష్ణా  జిల్లాలో  ఉన్న మా నాయకులను , కార్యకర్తలను వినియోగించడంలో విఫలం అయింది . పార్టీ లో చేరినప్పటి నుండి అధినాయకుడి మాటే .. నా బాట అని నిబద్ధతతో పని చేసాను. అదే విధంగా మా కార్యకర్తలకు , నాయకులకు సముచిత స్థానం కల్పించమని  చంద్రబాబు గారిని కోరాను . నామీద నమ్మకంతో మీరు నాకు అప్పజెప్పిన ప్రతిబాధ్యతని నిజాయితీగా క్రమశిక్షణతో నిర్వహించాను. ఎన్నికలలో నాకు అనువైన  స్థానం కాకపోయినా మీ ఆదేశాలమేరకు గుడివాడ నుండి పోటీచేశాను. ఓటమి బాధ కలిగించినా లెక్కచేయకుండా పార్టీ కోసమే ముందడుగేసాను. కానీ ఇన్నాళ్లు నా కష్టంలో నష్టంలో అనుక్షణం నావెన్నంటి ఉన్న కార్యకర్తలకు దేవినేని నెహ్రూగారి అనుచరులకు తగిన ప్రాధాన్యం దొరకకపోవడం బాధ కలిగించింది. కొంతమంది లోకల్ నాయకులు కావాలనే ఇదంతా చేస్తున్నా అధిష్టానం పట్టించుకోకపోవడం కార్యకర్తలకు రుచించలేదు. కానీ నా నిబద్ధత ను పార్టీ అధిష్ఠానం తేలికగా తీసుకుని , మా కార్యకర్తల మనోభావాలను  పరిగణలోకి తీసుకోకుండా వారికి ప్రాధాన్యం కలిగించడం లో పూర్తిగా విఫలం అయింది .

ఈ రోజు నేను కానీ, మా నాన్న గారు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రు గారు కానీయండి .. ఇలా ఉన్నాం అంటే అది కేవలం మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు , అభిమానుల వల్ల మాత్రమే . అలాంటిది మా కార్యకర్తలకు ప్రాధాన్యం లేని చోట నేను ఉంటూ  ఆత్మవంచన చేసుకోలేను.  అలాగే పార్టీలో కమిట్మెంట్ తో పని చేసే వారికి ప్రాధాన్యం లేకపోవడం , పైగా భజన చేసే వారికి వత్తాసు పలకడం .. నా మనసును ఎంతో గాయపరిచాయి .పార్టీ మారే ఉద్దేశం లేదని నేను ఎన్ని విధాలుగా చెప్తున్నా ఎప్పటికప్పుడు నేను పార్టీ మారుతున్నానని వదంతులు పుట్టించి, అధిష్టాననానికి  నాగురించి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చెయ్యడంలో సఫలం అయినవాళ్ళని ఇంకా చేరదీస్తూ ఉండడంతో మనసు విరిగిపోయింది.  పార్టీ నాకు అందించిన ప్రతి పనినీ బాధ్యతగా నిర్వర్తించాను, కానీ నేడు అసలు నా విషయంలో పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు నన్నే కాదు నా కార్యకర్తలు అనుచరులను కూడా అయోమయానికి గురిచేస్తున్నాయి. మొన్న గుడివాడ ఇంచార్జి అన్నారు  ఈరోజు గన్నవరం అంటున్నారు .. రేపు ఇంకెక్కడో .. ఇలా ప్రతిసారీ నేను మారినా నా కార్యకర్తలు కూడా మారాలంటే ఎలా ? స్థానికంగా బలపడుతున్న ప్రతీసారీ ఇలాంటి ఒడిదుడుకులు వస్తుంటే ఎక్కడ కుదురుకోవాలి ? ఎలా పార్టీని బలపరచాలి ? అందుకే ..కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించిన మీదట .. పార్టీ వీడాలని నిర్ణయించుకున్నాను .. నన్ను ఇంతకాలం ఆదరించిన చంద్రబాబు గారికి నా కృతఙ్ఞతలు. మీ మీద నాకున్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది అని తెలిపాడు 

ఇక కొద్దిసేపటి క్రితమే ..తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ సమక్షంలో   దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు. అవినాష్ తో పాటుగా కడియాల బుచ్చిబాబు కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు.సీఎం జగన్ అవినాష్‌కు విజయవాడ తూర్పు అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.  ప్రస్తుత ఏపీలో జరుగుతున్న రాజకీయాలని చూస్తే..బీజేపీ కీలక నేత చెప్పినట్టు అతి త్వరలో టీడీపీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తుంది.
Tags:    

Similar News