దేవినేని నెహ్రూ అంతర్మథనం

Update: 2016-12-19 06:03 GMT
పవర్ కోసం పార్టీలు ఫిరాయించే నేతలు అనుకున్నది జరగకపోతే రగిలిపోతుంటారు... ఇప్పుడు విజయవాడకు చెందిన సీనియర్ లీడర్ దేవినేని నెహ్రూ కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారట. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో ఉండి ఇటీవలే టీడీపీలోకి వచ్చిన ఆయన తనది రాంగ్ స్టెప్పేమో అని ఇప్పుడు ఫీలవుతున్నారట. ఇప్పటికిప్పుడు పవర్ ఎలాగూ రాదు.. కనీసం పార్టీలో మర్యాదైనా  దక్కితే బాగుణ్నని అనుకుంటున్నారట.
    
అనుకోని రీతిలో కాంగ్రెస్‌ ను వీడి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్న నెహ్రూ ఇపుడు అక్క‌డ ఏమాత్రం సంతృప్తిగా లేరు. కాంగ్రెస్ పార్టీలోలాగా తెలుగుదేశంలో సొంత మాట చెలామ‌ణి కాక ఆయన తెగ ఇబ్బంది పడుతున్నారట. పైగా... టీడీపీలో చాలామంది నేతలు తనను వ్యతిరేకిస్తుండడంతో అదో కష్టంగా మారింది.
    
త‌న‌కంటే కూడా త‌న త‌న‌యుడి రాజ‌కీయ భ‌విత‌వ్యం గురించే నెహ్రూ ఎక్కువ‌గా క‌ల‌ర‌వ‌పాటుకు గురవుతున్నారట. త‌న‌కు ఎమ్మెల్సీ, త‌న త‌న‌యుడికి పెన‌మ‌లూరు అసెంబ్లీ సీటు ఖ‌రారు చేస్తార‌న్న వ్యూహంతోనే దేవినేని నెహ్రూ కాంగ్రెస్‌ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ తెలుగుదేశంలో చేరిన‌ప్ప‌టి నుంచి ఏస్థాయిలోనూ నెహ్రూకు పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయింది. క‌నీసం పార్టీ అధికారిక‌ కార్య‌క్ర‌మాల‌కు సైతం ఆహ్వానం లేకుండా పోతోంది. దీనికి స్వ‌ప‌క్షంలోని సొంత సామాజిక వ‌ర్గాలే నెహ్రూను దెబ్బ‌తీస్తున్నాయి. నెహ్రూ తూర్పు నియోజ‌క‌ వర్గంలో ఉన్నారు. గ‌తంలో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేశారు. అపుడు తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి గ‌ద్దేరామ్మోహ‌న్‌. ప్ర‌స్తుతం ఆయ‌నే ఎమ్మెల్యే. వీరిరువురికీ తీవ్ర‌ విబేధాలు. ఇద్ద‌రిదీ ఒకే సామాజిక వ‌ర్గం. కానీ రాజ‌కీయ‌ ప్ర‌త్య‌ర్థులు. నెహ్రూ త‌న‌కంటే సీనియ‌ర్‌, మంత్రిగా ప‌నిచేశారు. చక్రం తిప్ప‌గ‌ల‌రు. ఏమాత్రం అవ‌కాశం ఇచ్చినా త‌న‌ను డామినేట్ చేసే ప్ర‌మాదం ఉంద‌ని గ‌ద్దె భ‌య‌ప‌డుతున్నారు. అందుకే నెహ్రూకు అవ‌కాశం వ‌చ్చిన చోట‌ల్లా అణ‌చివేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో నెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి వ‌చ్చి సాధించింది ఏముంది? అనే ప్ర‌శ్న వేసుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News