తెలంగాణలో అనుక్షణం గస్తీ .. 2020 లో తగ్గిన నేరాలు , వార్షిక నేర నివేదిక !
మరికొద్ది గంటల్లోనే ఈ ఏడాది ముగియబోతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కేసుల వివరాలని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. కరోనా కష్ట కాలంలో పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేశారని, గత సంవత్సర కాలంలో మహిళలు, పిల్లల భద్రతకు పెద్ద పీట వేసామని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి రాష్ట్రంలో ఆరు శాతం నేరాలు తగ్గుముఖం పట్టాయని, హత్యల్లో 8.59శాతం, ప్రాపర్టీ క్రైమ్‌లో 21శాతం, దోపిడీల్లో 28, రాబరి 33శాతం, చైన్ స్నాచింగ్ 46శాతం తగ్గాయని చెప్పారు. అలాగే మహిళలపై నేరాలు 1.92శాతం, వైట్ కాలర్ నేరాలు 42శాతం, రోడ్డు ప్రమాదాలు 13.9శాతం తగ్గాయన్నారు. ఈ ఏడాది 54 శాతం ప్రాపర్టీ రికవరీ చేశామని చెప్పారు.
తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే సంవత్సరం నాలుగు కేసుల్లో మరణ శిక్షణలు పడ్డాయన్నారు. ఆసిఫాబాద్ లింగాపూర్, వరంగల్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని రెండు కేసుల్లో మరణ శిక్షలు పడ్డాయన్నారు. రోడ్డు ప్రమాదాలు 13.93%, మరణాలు 9% తగ్గాయని తెలిపారు. గత ఏడాది కన్విక్షన్ రేటు 29.4 % ఉంటే ఈ ఏడాది 48.5% పెరిగిందని... రాష్ట్ర వ్యాప్తంగా 2020లో 99,095 సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సిసి కెమెరాలు ద్వారా 4490 కేసులు ఛేదించామని... జీరో FiR కింద 624 కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు. ఇక పీడీ యాక్ట్ కేసులో 350 మందిని జైళ్లకు పంపామన్నారు. అలాగే షీ టీమ్స్ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 4855 ఫిర్యాదులు రాగా, 567 FIR లు నమోదు చేశామని తెలిపారు. ఈ ఏడాది యాక్సిడెంట్ లు 16866 చోటు చేసుకున్నాయని...ఇందులో 5821 మంది చనిపోగా... 16591 మంది క్షతగాత్రులు అయ్యారని తెలిపారు.
2020 లో రాష్ట్ర వ్యాప్తంగా 11 ఎన్కౌంటర్లు జరగగా.. అందులో 11 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. 135 మంది మావోలను అరెస్ట్ చేశామన్నారు. మావోల నుంచి ఈ ఏడాది ఒక ఏకే 47 గన్ తో పాటు, మొత్తం 22 ఆయుధాలలు, 3 ల్యాండ్ మైన్స్ , 23 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గత సంవత్సర కాలం నుంచి రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, అన్ని పండుగలు, కార్యక్రమాలు, ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పూర్తి చేశామన్నారు. శాంతిభద్రల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ విజయవంతంమైందని చెప్పారు.