ఫసక్.. ఈ మాట దేశం మొత్తం చాలా పాపులర్ అయ్యింది. ఈ మాటతో ఆడియోలు - వీడియోలు అన్నీ వచ్చేశాయి. రేపో మాపో సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదు. అసలు ఈ మాటకు ఆద్యుడు. ఆల్ ఇండియా పేటెంట్ రైట్ హోల్డర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబే. ఒక ఇంటర్వ్యూలో ఈ ఫసక్ అనే పదాన్ని మోహన్ బాబు వాడారు. అప్పటినుంచి ఈ పదం వైరల్ అయ్యింది. అలాంటి ఫసక్ స్టార్ కి ఇప్పుడు కోపం వచ్చింది. ఆ కోపం కూడా తెలంగాణ సర్కార్ పై.
మ్యాటర్ లోకి వెళ్తే.. దాసరి విగ్రహావిష్కరణకు పాలకొల్లు వెళ్లారు మోహన్ బాబు. విగ్రహ ఆవిష్కరణ తర్వాత చాలా ఆవేశంగా మాట్లాడారు. దాసరి పుట్టినూరు పాలకొల్లులో ఇంత గొప్పగా విగ్రహం పెడితే.. హైదరాబాద్ లో కనీసం విగ్రహం పెట్టేందుకు స్థలం కూడా ఇవ్వలేదని బాధపడ్డారు. అంటే.. మోహన్ బాబు పరోక్షంగా తెలంగాణ సర్కార్ ఇవ్వలేదని చెప్పినట్లే. సాధారణంగా కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మినహా మిగిలిన వారెవ్వరూ కామెంట్ చేసేందుకు సాహసించరు. సినిమా వాళ్లు అయితే మరీ. కాళ్లమీద పడరు కానీ అంతకన్నా ఎక్కువే. కానీ మోహన్ బాబు స్టైలే డిఫరెంట్. ఆయన మనసులో ఉన్నది బయట చెప్పడానికి ఏ మాత్రం మోహమాట పడరు. అందుకే.. ఉన్న విషయాల్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ సర్కార్. . దాసరి విగ్రహం పెట్టేందుకు స్థలం కేటాయిస్తుందో లేదో చూడాలి.