ఆర్ ఎస్ ఎస్ రిజిష్టర్ కూడా కాలేదట

Update: 2016-07-24 10:50 GMT
ఎవరు అవునన్నా.. కాదన్నా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎంత పవర్ ఫుల్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ సంస్థ పొలిటికల్ ఐడియాలజీతోనే కేంద్రంలోని మోడీ సర్కారు నడుస్తుందన్నది కాంగ్రెస్ వర్గాల వాదన. వారికి చెప్పినట్లే మోడీ సైతం నడుచుకోవాల్సిందని.. కమలనాథుల మీద కస్సుమంటూ విమర్శలు చేసే వారంతా తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. ఇదిలా ఉంటేఈ సంస్థ జాతిపిత మహాత్మా గాంధీని చంపిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి కోర్టు కేసుల్లో చిక్కుకుపోయారు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ.

ఈ కేసు ఉదంతంపై సుప్రీంకోర్టు సైతం సీరియస్ అయి.. సారీ చెప్పాలని రాహుల్ కు చెప్పటం.. ఒకవేళ క్షమాపణ కానీ చెప్పకుంటే కేసు విచారణ ఎదుర్కొంటారన్న తీవ్ర వ్యాఖ్యను అత్యున్నత న్యాయస్థానం చేసినా.. ఆ అంశంపై రాహుల్ సమాధానం చెప్పక పోవటం.. ఆయన విధేయ వర్గానికి చెందిన డిగ్గీ రాజా.. గాంధీ ఫ్యామిలీకి సారీ చెప్పే ఘన చరిత్ర లేదని చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆర్ ఎస్ ఎస్ మీద అనుచిత వ్యాఖ్య చేసి కోర్టు కేసు ఎదుర్కొంటున్న తమ యువరాజు కష్టాల్ని డిగ్గీరాజా సరిగా గుర్తించనట్లుగా ఉంది. ఎందుకంటే.. తాజాగా ఆయన సైతం ఆర్ ఎస్ ఎస్ పైన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

ఆర్ ఎస్ ఎస్ సంస్థ అస్సలు రిజిష్టర్ కాలేదని.. దానికి ప్రభుత్వ గుర్తింపు లేదని వ్యాఖ్యానించారు. ప్రతి ఏటా గురుపూర్ణిమ సందర్భంగా పెద్ద ఎత్తున నిధులు సేకరిస్తారని.. దానికి సంబంధించిన లెక్కను బయటపెట్టాలంటూ డిగ్గీ రాజా వ్యాఖ్యానించారు. నమోదు కాని సంస్థల్ని ప్రభుత్వం బ్యాన్ చేయాలని అడుగుతున్నారని.. కానీ.. అది చట్టబద్ధమైన సంస్థ కాదంటూ ఆయన వ్యాఖ్యానించట గమనార్హం. రిజిష్టర్  కాని సంస్థ అంటూ డిగ్గీ రాజా చేసిన వ్యాఖ్యలపై ఆర్ ఎస్ ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News