ఏపీ గల్లీల్లో కొట్టుకునే.. తిట్టుకునే వైసీపీ ఎంపీలు ఇప్పుడు పార్లమెంట్ లోనూ ఆంధ్రా పరువు తీసేలా ప్రవర్తించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో గొడవపడుతూ ఇప్పుడు పార్లమెంట్ వేదికగానూ వైసీపీ, టీడీపీ ఎంపీలు అదే పనిచేస్తున్నారు.
ఇటీవల పార్లమెంట్ లో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తీవ్ర ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. దానికి కౌంటర్ గా వైసీపీ ఎంపీలు తాజాగా చంద్రబాబు చేతకానితనం అంటూ ఎత్తి చూపారు. పైగా రాజ్యసభలో గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ హాలులో క్యాసినో జరిగినట్లు కనకమేడల ఆరోపించారు.
ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని అనేక విధాలుగా చంద్రబాబు నాయుడు అండ్ టీం టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబును మంత్రులు, వైసీపీ నేతలు కూడా అంతే స్తాయిలో టార్గెట్ చేస్తున్నారు. రెండు పార్టీల్లో రోజు ఉండే గోల అని వీరి రభసను జనాలు అస్సలు పట్టించుకోవడం లేదు.
అయితే రాష్ట్రంలో సరిపోదన్నట్టుగా ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఏపీ పరువును రెండు పార్టీల నేతలు తీయడాన్నే జనాలు జీర్ణించుకోవడం లేదు. పార్లమెంట్ లో రెండు పార్టీల ఎంపీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం ద్వారా ఏపీ రువు పోతోందని ఆలోచించడం లేదు. రెండు పార్టీల పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం గతంలో కూడా జరిగాయి.
అయితే ఈసారి టీడీపీ ఎంపీలు మరీ తీవ్రంగా ఆడిపోసుకుంటున్నారు. రాష్ట్రంలో ఆర్థిక అరాచకం పెరిగిపోతోంది కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేయడం గమనార్హం. ఇక రాష్ట్రం దివాళా తీయడానికి చంద్రబాబు పాలనే కారణమంటూ వైసీపీ ఎంపీలు ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చేసరికే చంద్రబాబు ఏకంగా 2 లక్షల కోట్లు అప్పుల్లో ఉంచాడని ఆరోపిస్తున్నారు. దీనికి చంద్రబాబే కారణమంటున్నాడు.
టీడీపీ ఎంపీలు ఇద్దరు ముగ్గురు ఆరోపిస్తే వైసీపీ ఎంపీలు అంతకుమించి విరుచుకుపడుతున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. పార్లమెంట్ లో నినాదాలు, ఆందోళనలతో అట్టుడికిస్తున్నారు. రెండు పార్టీలు రాష్ట్ర అభివృద్ధి ఎజెండా మరిచి నరేంద్రమోడీ ముందర ఏపీని చులకన చేసేలా ప్రవర్తిస్తున్నారు. ఈ రెండు పార్టీల ఎంపీల తీరు చూసి ఇప్పుడు జనాలే ఈసడించుకుంటున్నారు.