ఇంతకూ పవన్‌ చెప్పుల ఖరీదెంతో తెలుసా?

Update: 2022-10-20 06:00 GMT
తనను వైసీపీ నేతలు ప్యాకేజీ స్టార్‌ అని విమర్శిస్తుండటంపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పవన్‌.. ప్యాకేజీ స్టార్‌ అని పిలిచే వైసీపీ నా కొడుకులను చెప్పు తీసుకుని దవడ పగిలేలా కొడతానని వార్నింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పవన్‌ తన కాలి చెప్పును తీసి చేతిలో పట్టుకుని వైసీపీ నేతల దవడ పళ్లు రాలగొడతానని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇంకోసారి ప్యాకేజీ.. గీకేజ్‌ అంటే.. చెప్పు తీసుకొని.. పళ్లు రాలకొడుతాను కొడుకల్లారా.. చవటల్లారా.. దద్దమ్మల్లారా.. వెధవల్లారా.. నా సహనమే మిమ్మల్ని రక్షించిందంటూ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ వేసుకున్న చెప్పులు ఏ కంపెనీవి? వాటి ధరెంత అనే చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతుండటం విశేషం. ఆ చెప్పులకున్న విశేషం ఏమిటంటూ ఆసక్తికరంగానే ఈ చర్చ నడుస్తోంది. దీనిపై నెటిజన్లు, పవన్‌ అభిమానులు సైతం ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్స్‌లో వెతుకులాట సాగిస్తున్నారు.

కాగా పవన్‌ కల్యాణ్‌ ధరించిన చెప్పులు యూకేకు చెందిన ఫిట్‌ఫ్లాప్‌ సంస్థవని తెలుస్తోంది. ఫిట్‌ఫ్లాప్‌ చెప్పులను పవన్‌ కల్యాణ్‌ ఎన్నో ఏళ్ల నుంచి వినియోగిస్తున్నారని చెబుతున్నారు. ఫిట్‌ఫ్లాప్‌ కంపెనీ ఉత్పత్తులంటే పవన్‌ కల్యాణ్‌కు ఇష్టమని సమాచారం.

అత్తారింటికి దారేది సినిమా నుంచి ఈ బ్రాండ్‌ చెప్పులనే పవన్‌ కల్యాణ్‌ వాడుతున్నారని అంటున్నారు. ఈ చెప్పుల ధర సుమారు 63 డాలర్లు అని ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్స్‌లో చూపిస్తోందని పేర్కొంటున్నారు. పవన్‌ ధరించిన చెప్పుల విలువ భారత కరెన్సీలో సుమారు రూ.6 వేలు అని తెలుస్తోంది.

పవన్‌ కల్యాణ్‌ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శల తర్వాత ఆ చెప్పులకు ఆయన అభిమానుల నుంచి భారీ డిమాండ్‌ ఏర్పడిందని వార్తలు వస్తున్నాయి. పలు ఆన్‌లైన్‌ షాపింగ్స్‌ మాల్స్‌ పవన్‌ కల్యాణ్‌ చెప్పులు అని వీటిని అమ్ముతున్నట్టు సమాచారం. దీంతో వీటిని సొంతం చేసుకోవడానికి జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పోటీ పడుతున్నారని చెబుతున్నారు. ఫిట్‌ఫ్లాప్‌ బ్రాండ్‌ అమ్మకాలు గత రెండు రోజులుగా ఆన్‌లైన్‌లో ఊపందుకున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ క్రేజ్‌ అంటే ఇదిరా అని ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News