భారత ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ ఈరోజు ప్రపంచ ధనవంతుల్లో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ డేలా సంచలన విషయాన్ని వెల్లడించింది. 60 ఏళ్ల వయసున్న అదానీ దాదాపు 10 లక్షల కోట్ల (137 బిలియన్ డాలర్లు) వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి.
ప్రపంచ కుబేరుల్లో ప్రస్తుతానికి మొదటి రెండు స్థానాల్లో టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఉన్నారు. మన అదానీ 3వ స్థానంలో ఉన్నారు.
గౌతం అదానీ బడా వ్యాపారవేత్త అయినా పెద్దగా చదువుకోలేదు. కాలేజీ డ్రాపౌట్ స్టూడెంట్. అదానీ తండ్రి బట్టల షాప్ ద్వారా తన తొలి వ్యాపారాన్ని ప్రారంభించాడు.
ఇక 2008లో ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ పై జరిగిన దాడిలో ప్రాణాలతో బయటపడిన వారిలో మన గౌతం అదానీ కూడా ఉండడం గమనార్హం.
గౌతం అదానీ ఫ్యామిలీ చస్తే ఆయనకు ఇద్దరు కుమారులు.. కరణ్ అదానీ, జీత్ అదానీలున్నారు. కరణ్ అదానీకి వివాహమైంది. ఇతడు పరిధి ష్రాఫ్ ను వివాహమాడారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. పెద్ద కొడుకు కరణ్ కు అదానీ ప్రస్తుతం ‘పోర్ట్స్ సీఈవో’ పోస్ట్ ఇచ్చాడు. చిన్న కుమారుడికి ఎటువంటి పగ్గాలు ఇవ్వలేదు. పెళ్లి కాలేదు.
ప్రస్తుతం అదానీ పోర్టుల నుంచి పవర్ ప్లాంట్ల వరకూ.. సిమెంట్ కంపెనీల నుంచి మీడియా వరకూ ప్రతీ వ్యాపారాన్ని ఆయన అందుకుంటున్న తీరే కార్పొరేట్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఎన్డీటీవీని టేకోవర్ చేసుకునేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నం బిజినెస్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దేశమంతా ఇప్పుడు అదానీ మయం అవుతోంది. ఎక్కడ చూసినా అదానీ కంపెనీలే కనిపిస్తున్నాయి. ఉప్పు పప్పు నుంచి వంటనూనెల వరకూ.. విద్యుత్ రంగం నుంచి పోర్టుల వరకూ.. తాజాగా మీడియా రంగంలోనూ అదానీ రంగ ప్రవేశం చేశారు. మోడీ సర్కార్ పాలనలో ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఇంతలా పురోభివృద్ధి సాధించడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.