ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఆయన మరణంతో పెద్ద కొడుకు ముఖేష్ ఇంకా విస్తరించాడు. కానీ చిన్న కొడుకు అనిల్ అంబానీ విభేదాలకు పోవడం.. ఆస్తులు పంచుకోవడంతో రిలయన్స్ కాస్తా రెండుగా చీలింది. ఎవరి వ్యాపారాలు వారికి వచ్చాయి. ముఖేష్ తన శక్తిసామర్థ్యాలతో దేశంలోనే శక్తివంతమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ను ముందుకునడిపించి దేశంలోనే నంబర్ 1 కుబేరుడిగా ఎదిగాడు. ఇక ప్రపంచంలోని టాప్ 100లో ఒకడిగా వెలుగొందాడు. ముఖేష్ అంబానీ సారథ్యంలో ఆయన కంపెనీల బ్రాండ్ విలువ ఆకాశాన్ని అంటగా.. అదే సమయంలో అనిల్ అంబానీ సారథ్యంలోని కంపెనీల బ్రాండ్ విలువ పడిపోయింది.
తాజాగా లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇండిపెండెంట్ స్ట్రాటజీ కన్సల్టెంట్’ విడుదల చేసిన ‘బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా100’ కంపెనీల బ్రాండ్ విలువల్లో అనిల్ అంబానీ కంపెనీల బ్రాండ్ విలువ 65శాతం తగ్గి 3848 రూపాయలకు పడిపోవడం వ్యాపార వర్గాలకు షాకిచ్చింది. అనిల్ అంబానీ కంపెనీల విలువ దేశంలో 56వ స్థానానికి పడిపోయింది. 2018తో పోలిస్తే 28 ర్యాంకులు పడిపోవడం గమనార్హం.
భారత్ లో బ్రాండ్ విలువలో టాటా గ్రూప్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. వరుసగా రెండో ఏడాది కూడా టాటా గ్రూపు ఈ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. దీని తర్వాత స్థానాల్లో ఎల్ ఐసీ- ఇన్ఫోసిస్- ఎస్బీఐ- మహీంద్రా సంస్థలు ఉన్నారు. ఇక ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో 300 కోట్ల డాలర్ల బ్రాండ్ విలువతో ఈ జాబితాలో 14వ స్థానాన్ని దక్కించుకుంది.
ప్రస్తుతం అనిల్ అంబానీ కంపెనీలు పీకల్లోతు అప్పల్లో ఉండి ఆస్తులు అమ్మకానికి రెడీ అయ్యాయి. అనిల్ అంబానీ అయితే అప్పు చెల్లించలేక జైలుకు వెళ్లాల్సి వస్తే అన్న ముఖేష్ ఆదుకొని అప్పుచెల్లించి రక్షించాడు.
అయితే బ్రాండ్ విలువలో అనిల్ అంబానీతోపాటు ముఖేష్ కంపెనీలు కూడా మొదటి స్థానంలో నిలవకపోవడమే ఇక్కడ విశేషం. ముఖేష్ జియో బ్రాండ్ 14వ స్థానంలో నిలిచింది. ఇలా ఎంతో ఎత్తున ఉండే అంబానీల బ్రాండ్ విలువ దేశంలో పడిపోవడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.