దేశంలో ఉండే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కేరళ ఒకటి. నిత్యం వేల మంది పర్యాటకులు కేరళలో ఉన్న వివిధ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు అక్కడికి వెళ్లి వస్తుంటారు. ఇదే క్రమంలో ఆ రాష్ట్రంలో కొత్త వైరస్ లు, అంతుచిక్కని వ్యాధులు పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా కేరళలో ఓ వైరస్ కలకలం రేపుతుంది. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతమైన కోవలంలో ఈ వ్యాధి ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. ఈ వ్యాధి సోకిన శునకాలు కొద్ది రోజులకే మరణిస్తున్నాయని అధికారులు చెప్పారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే రాష్ట్రంలో సుమారు 20 పైగా కుక్కలు ఈ వ్యాధితో చనిపోయాయని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి అక్కడ ఉన్న స్థానికులను ఆందోళనకు గురి చేస్తుంది.
ఈ శునకాల మరణం వెనుక ఉన్న కారణాలపై ఇప్పటికే కేరళ పశుసంవర్ధక శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ వ్యాధి సోకినప్పుడు కుక్కల్లో వచ్చే లక్షణాలను వీరు కనిపెట్టారు. మొదటగా శ్వాస తీసుకోవడంలో కొంతమేర ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఆపై వాటికి వణుకు వస్తుందని తెలిపారు. అంతేగాకుండాడ ఉన్నట్టుండి బాగా నీరసించిపోతాయని వివరించారు. ఇవే ఆ వ్యాధికి ప్రధాన కారణాలుగా చెప్పుకొచ్చారు.
ఈ లక్షణాలను చనిపోయిన 20 శునకాల్లో గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ లక్షణాలు వెలుగుచూసిన కేవలం రెండు రోజుల్లో శునకాలు చనిపోతున్నాయని వివరించారు. ఈ వ్యాధి పెంపుడు కుక్కల్లో కనిపిస్తే ... వాటి నుంచి మానవుల కూడా సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒక వేళ ఈ వ్యాధి మానవులకు సోకితే.. ఏమైనా ఆపద కలుగుతుందా అనే కోణంలో కూడా వైద్య నిపుణులు పరిశోధన కొనసాగిస్తున్నారు. గతంలో కూడా కరోనా వైరస్ ను కేరళలోని మొదటగా గుర్తించారు. ఇటువంటి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొత్త వ్యాధిపై పరిశోధనలు చేపడుతున్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి ఈ వ్యాధి ఎక్కువగా వీధి కుక్కలోనే కనిపిస్తోందని... అయితే పెంపుడు కుక్కల్లో ఈ వ్యాధి ని ఇంకా గుర్తించలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈ వ్యాధి పెంపుడు జంతువుల్లో కూడా కనిపించినట్లయితే పరిస్థితులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందే ఒక వైరస్ తో కూడిన ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో ఇటువంటి వ్యాధిని ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. దీని ఆనవాళ్లను బట్టి చూస్తే ఈ వైరస్ కసైన్ డిస్టెంపర్ అని వైద్యులు ప్రాథమిక అంచనా వచ్చారు.
సాధారణంగా ఈ వైరస్ అనేది నక్కలు, తోడేళ్ళలో ఎక్కువగా కనిపిస్తోందని చెప్పారు. ఈ వ్యాధిని అరికట్టాలంటే అత్యంత ఖరీదైన టీకా అవసరమని నిపుణులు భావిస్తున్నారు ఇప్పటికే వైరస్ కుక్కల్లో చాలా వేగంగా వ్యాప్తి చెందడం గుర్తించిన అధికారులు ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారాన్ని వెతికే పనిలో వైద్యాధికారులు నిమగ్నమయ్యారు.ప్రస్తుతానికి మానవులు ఈ వైరస్ సోకే ప్రమాదం ఏమీ లేదని చెప్తున్న అధికారులు... ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.