నోటికి హద్దే లేనట్లుగా మాట్లాడటం కొందరు నేతలకు అలవాటు. అయితే.. అది మరీ శ్రుతిమించినట్లుగా అనిపిస్తుంది డోనాల్డ్ ట్రంప్ తీరు చూస్తుంటే. వివాదాస్పద వ్యాఖ్యలతో ఇప్పటికే బహుళ ప్రచారాన్ని పొందిన ట్రంప్ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యను చేశారు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో బరిలోకి నిలిచేందుకు ప్రయత్నిస్తున్న ఆయన ఇండియానాలోని ఫోర్ట్ వేన్ నగరంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. చైనా నుంచి ఉద్దేశించి ఆయన తీవ్రస్థాయిలో మండిపడిన ట్రంప్ ఈ సందర్భంగా ప్రయోగించిన ఒక పదం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అమెరికాను రేప్ చేయటానికి చైనాకు ఎంతమాత్రం అవకాశం ఇవ్వనంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్య సంచలనంగా మారింది.
చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయని.. గ్లోబల్ మార్కెట్లో తమ ఉత్పతుల ఎగుమతులు పెరగటానికి చైనా తన కరెన్సీ విషయంలో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. అమెరికా వాణిజ్యాన్ని చైనా చంపేస్తోందన్న ట్రంప్.. ఆ తీవ్రత చెప్పేందుకు వీలుగా రేప్ అన్న పదాన్ని వాడటం గమనార్హం.
చైనా మీద తనకు ఎలాంటి కోపం లేదంటూనే.. అమెరికా నేతల అసమర్థత కారణంగానే అమెరికా వాణిజ్యం ప్రస్తుతం ఉన్న పరిస్థితికి చేరుకుందన్నారు. చైనా అనుసరిస్తున్న వాణిజ్య విధానం వల్ల అమెరికా నష్టపోతుందన్నారు. చైనాతో పోలిస్తే అమెరికా చాలా శక్తివంతమైన దేశమన్న ఆయన మాటలు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి.