కూతురి బ్రాండ్ కోసం ట్రంపే రంగంలోకి దిగారే

Update: 2017-02-09 06:53 GMT
ఆయన అమెరికా అధ్యక్షుడు. ప్రపంచానికే పెద్దన్న. మరి అలాంటి వ్యక్తి తీసుకునే నిర్ణయాలు ఎంతో హుందాగా.. పెద్దరికంగా ఉండాలి. కానీ.. ఇలాంటి వాటిని ట్రంప్ చాలా లైట్ తీసుకుంటారు. అమెరికా అధ్యక్షుడిగా ఉండి.. తన కూతురి బ్రాండ్ కోసం ట్విట్టర్ లో ట్వీట్ చేసేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన.. తాజాగా తన కుమార్తె బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు.. అది కూడా ఒక సూపర్ మార్కెట్ విషయం మీద ఆయన తన ట్వీట్ ప్రతాపాన్ని ప్రదర్శించటంపై పలువురు తప్పు పడుతున్నారు.

వ్యాపారవేత్త అయిన ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఇలా వ్యవహరించటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అధ్యక్షుడి కుటుంబ వ్యాపారాల మీద చాలానే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి వేళ.. తన కుమార్తెకు చెందిన బ్రాండ్ ను ఒక సూపర్ మార్కెట్ అమ్మటం కాదన్న దానిపై ట్రంప్ ఏకంగా ట్వీట్ చేయటం సంచలనంగా మారింది.

అమెరికా అధ్యక్ష ఎన్నిలకు ముందు ఆయన కమార్తె ఇవాంకాకు చెందిన ఒక బ్రాండ్ ఉత్పత్తుల్ని అమ్మకూడదని నార్డ్ స్ట్రూమ్ సూపర్ మార్కెట్ నిర్ణయించింది. తాజాగా ఆయన ఒక ట్వీట్ చేస్తూ.. ‘‘ఇవాంకాతో నార్డ్ స్ట్రూమ్ అన్యాయంగా వ్యవహరించింది.. ఇది చాలా దారుణం.. ఆమె చాలా గొప్ప మనిషి.. నేనెప్పుడూ సరైన పనులు చేసేలా ఆమె నన్ను ప్రోత్సహించింది’’ అంటూ ట్వీట్ చేశారు.

అధ్యక్షుల వారి ట్వీట్ కు స్పందించిన సూపర్ మార్కెట్.. అమ్మకాల ఆధారంగానే తమ నిర్ణయం ఉంటుందే తప్పించి.. రాజకీయ కారణాలతో ఆమె బ్రాండ్ ను నిలిపివేయలేదని వివరణ ఇచ్చింది.  ట్రంప్ ట్వీట్ ను పెద్ద ఎత్తున తప్పు పడుతున్నారు. ఒక సూపర్ మార్కెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ప్రశ్నించటం.. వ్యాఖ్యలు చేయటం ఏమిటని? అది కూడా తన కుమార్తె బ్రాండ్ విషయంలో అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైట్ హౌస్ ప్రతినిధి స్పైసర్ స్పందిస్తూ.. తన కుటుంబానికి అండగా ఉండే హక్కు ట్రంప్ కు ఉందన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి పనులు ట్రంప్ ఇంకెన్ని చేస్తారో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News