ట్రంప్ కోడలి దీపావళి మాటలు!

Update: 2016-10-26 08:54 GMT
మొదట్లో ఒక్కడే.. కేవలం తన నోటిని నమ్ముకుని ఎన్నికల ప్రచారంలోకి దిగినట్లు అనిపించారు అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్. అయితే తర్వాతి కాలంలో పరిస్థితులు మహిళలవైపు తిరిగేసరికి అతని భార్య లైన్ లోకి వచ్చారు. ట్రంప్ అలాంటివాడు కాదని, తన భర్త మారిన మనిషని.. గతంలో చిన్నా చితకా జరిగి ఉంటే జరగొచ్చు కానీ ఇప్పుడు అలా లేరని తనవంతు సమర్ధన చేశారు. ఆమె మాటల ఎఫెక్ట్ ఎలా ఉందనే సంగతి కాసేపు పక్కనపెడితే, తాజాగా ట్రంప్ కోడలు తెరపైకి వచ్చారు.

ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సర్వేలన్నీ దాదాపుగా హిల్లరీ క్లింటన్ వైపే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్న వేల, మరోవైపు భారతీయ అమెరికన్ల ఓట్లే కీలకంగా మారిన సమయంలో ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీని తన మామ వైపు తిప్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు ట్రంప్ కోడలు లారా!

ఈ కార్యక్రమంలో భాగంగా... వర్జీనియాలోని లాడన్ కౌంటీలోని హిందూ దేవాలయంలో జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ కోడలు లారా పాల్గొన్నారు. అక్కడున్న భారతీయులతో సందడి చేస్తూ... పనిలో పనిగా తన మామగారికి ఓటు వేయాలని ప్రవాస భారతీయులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లారా... ట్రంప్ అధ్యక్షుడైతే భారత్ - అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని, ఆమటకొస్తే... భారతీయులన్నా, భారతదేశమన్నా తన మామగారికి ఎంతో అభిమానమని చెప్పారు. ఇదే క్రమంలో భారతీయుల మనసును దోచుకునే పనిలో భాగంగా భారతీయ సంస్కృతిని తాను ఎంతోగానే గౌరవిస్తానని చెబుతూ చెప్పులు బయట విడిచిపెట్టి ఆమె ఆలయంలోకి ప్రవేశించారు. దీతో ఇండో అమెరికన్స్ కు లారా బాగా కనెక్ట్ అయ్యారని అంటున్నారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News