అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురవుతున్న షాక్ ల పరంపరలో మరో అంశం వచ్చి చేరింది. ఎన్నికల ప్రచారంలో అమెరికన్లకు ట్రంప్ ఒక హామీ ఇచ్చారు. తాను అధికారంలో కొస్తే మెక్సికన్లు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఒక పెద్ద గోడను కడతానని చెప్పాడు. అధికారంలోకి రాగానే చెప్పినట్లుగానే గోడ నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రంప్ చట్టబద్ధంగా వ్యవహరిస్తే గోడ నిర్మాణం అసలు సాధ్యం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఈ గోడను పూర్తి చెయ్యడానికి అవసరమైన డబ్బును ఎక్కడ నుంచి తీసుకొస్తారన్నదానిపై మాత్రం సర్వత్రా చర్చ నడుస్తోంది.
ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత మెక్సికో సరిహద్దు పొడవునా 9 మీటర్ల ఎత్తులో గోడను నిర్మించాలని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ గోడ నిర్మాణం కోసం మెక్సికో నుంచే పన్నులు వసూలు చేస్తామని ట్రంప్ తొలుత ప్రకటించారు. అయితే మెక్సికో అందుకు నిరాకరించింది. ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదని తెలిపింది. దీంతో ప్రజల సొమ్మునే గోడ నిర్మాణానికి వినియోగించాలని ఆయన నిర్ణయించారు. దీనికి రూ. 1.36 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంతర్గత భద్రతాధికారి జాన్ కెల్లీ పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లు రూ. 79 వేల కోట్లు నుంచి 90 వేల కోట్లు మధ్యలో ఖర్చు అవుతుందని అభిప్రాయపడ్డారు. ట్రంపే స్వయంగా రూ. రూ. 78 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో తొలి విడతగా రూ. 16.9 వేల కోట్లు విడుదల చేయాలని తొలి బడ్జెట్ ప్రతిపాదనలో అమెరికా కాంగ్రెస్ ను ట్రంప్ ప్రభుత్వం కోరింది. అయితే ఇందులో ఎంత మొత్తాన్ని విడుదల చేసేందుకు కాంగ్రెస్ అంగీకరిస్తుందా అన్నది అనుమానమే. ఎందకంటే ఈ గోడ నిర్మాణానికి నిధులు ఎక్కడ నుంచి తీసుకురావాలన్నదానిపై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు శ్వేతసౌధం అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ వెల్లడించారు.
మరోవైపు అన్నిటికంటే మించి గోడ నిర్మాణానికి అనేక భౌగోళిక సమస్యలు అడ్డంకిగా ఉన్నాయి. మెక్సికో-అమెరికా సరిహద్దు భూభాగం చాలా మటుకు టెక్సాస్, రియో గ్రాండె నదీ ప్రాంతంలో ఉంది. 1970లో మెక్సికోతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నదీ ప్రాంతంలో చేపట్టిన ఏ నిర్మాణమైనా నది వెడల్పును తగ్గించేదిగా ఉండకూడదు. అరీజోనాలో కూడా కొలరెడో నది విషయంలో ఇదే సమస్య ట్రంప్‌కు ఎదురుకానుంది. ఇందుకు అంతర్జాతీయ సరిహద్దు సమస్య అడ్డంకికాగా అన్నిటి కంటే మించి పర్యావరణ అనుమతులను పొందాల్సి ఉంది. అందుకే పర్యావరణ పరంగా సున్నితమైన కాలిఫోర్నియా సరిహద్దు ప్రాంతంలో గోడ ఎత్తును రూ. 2 మీటర్లకే కుదించాలని అధికారులు తెలిపారు.టెక్సాస్ సరిహద్దు ప్రాంత నివాసితులు అక్కడ భూభాగాలను కొనుక్కున్నారు. ఇక్కడ గోడ నిర్మించాలంటే వారి భూభాగాలను తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. అయితే ఇది అంత సులభం కాదు. జార్జి డబ్ల్యు బుష్ నుంచి ఒబామా ప్రభుత్వం వరకూ ఇదే అంశంపై పోరాడి విసిగిపోయారు. అయితే ఈ భూయజమానులను బుజ్జగించాలని ట్రంప్ నిర్ణయించారు. అవసరమైతే ఈ కేసులను పరిష్కరించేందుకు ఎక్కువ మంది న్యాయవాదులను నియమించాలని భావిస్తున్నారు. ఇలా ట్రంప్ ప్రధాన హామీ ఆచరణ సాధ్యం కావడం కష్టంగానే ఉందంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/