అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ట్రంప్ తన చిత్రవిచిత్రమైన ప్రవర్తనతో చిక్కుల్లో పడ్డారు. అగ్రరాజ్యానికి అధ్యక్షుడినన్న అహంకారమో లేక తనలో సహజంగానే ఉన్న దూకుడోగానీ ఏకంగా ఓ దేశాధినేతనే పక్కకు నెట్టేశారు. నాటో హెడ్ క్వార్టర్స్ లో ఉన్న బ్రసెల్స్ లో ఈ ఘటన జరిగింది. ఇతర దేశాధినేతలతో కలిసి నడుస్తున్న సమయంలో తనకు అడ్డుగా ఉన్న మాంటెనెగ్రో దేశ ప్రధాని డస్కో మార్కోవిక్ ను పక్కకు నెట్టి తాను ముందు నిల్చున్నారు ట్రంప్. సరిగ్గా ఫొటోలకు పోజులిచ్చే సమయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందింది.
ట్రంప్ తీరుపై మాంటనెగ్రోకు చెందిన పత్రిక తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. తాను ఉన్నట్లుగా ఎవరూ ఉండకూడదన్నట్లు ఆయన తీరు ఉందని విజెస్టి అనే పత్రిక వ్యాఖ్యానించింది. అమెరికా ఫస్ట్ అన్నట్లుగా ట్రంప్ వ్యవహరించారని ఇతర వెబ్‌సైట్లు వార్తలను ప్రచురించాయి. అయితే మాంటెనెగ్రో ప్రధాని మార్కోవిక్ మాత్రం ఈ ఘటనను లైట్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో రియాక్షన్లు చూసిన తర్వాత ఈ ఘటన ఇంత తీవ్రమైందన్న విషయం తనకు తెలిసిందని ఆయన చెప్పారు. ట్విట్టర్ ఎప్పటిలాగే ట్రంప్ తో ఆడుకుంది. ట్రంప్ పై సెటైర్లు - విమర్శలు - పంచ్ లు పేల్చేసింది
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/