రెట్టింపు సంక్షేమం...జగన్ తో బాబు పోటీ...?

Update: 2022-09-11 02:30 GMT
ఏపీలో వచ్చే ఎన్నికల కోసం వైసీపీతో టీడీపీ పోటీ పడుతోంది. అయితే రాజకీయంగానే కాదు సంక్షేమం విషయంలో కూడా తెలుగుదేశం తగ్గేదే లే అన్నట్లుగా దూకుడు చేయడానికి నిర్ణయించింది. పైకి అప్పులు చేసి సంక్షేమం వైసీపీ చేస్తోంది అని ఆరోపిస్తున్నా ప్రజలకు దీనివల్ల  భారీ లబ్ది కలుగుతోందని, ఫలితంగా వైసీపీకి ఇది రాజకీయంగా కలసివస్తుందేమో అన్న కంగారు టీడీపీలో ఉంది.

ఇక వచ్చే ఎన్నికల ముందు సామాజిక పించన్లు జగన్ మూడు వేలకు పెంచుకుపోతారు. అయితే ఆ ఎన్నికలలో టీడీపీ తాను గెలిస్తే ఏకంగా అయిదు వేల వరకూ సామాజిక పించన్ కింద నేలకు ఇస్తామని చెప్పనుందిట. అలాగే అమ్మ ఒడి కానీ మరే ఇతర పధకాలు కానీ ఇపుడు ఉన్నట్లుగా కాకుండా మరింత పకడ్బంధీగా చేయాలని, ఎక్కువ మొత్తాలు ఇవ్వాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు.

తాము కూడా మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా నదగు బదిలీ కిందనే లబ్దిదారుల ఖాతాలో వాటిని వేయడానికే మొగ్గు చూపుతోందిట. ఇక అన్ని సామాజిక వర్గాలతో పాటు ఈసారి అగ్ర వర్ణాల మీద కూడా టీడీపీ  ఎక్కువగా ఫోకస్ పెట్టనుంది అని తెలుస్తోంది. బ్రాహ్మణ కార్పోరేషన్ పెట్టి అప్పట్లో బ్రాహ్మణ ఓట్లను కొల్లగొట్టిన టీడీపీ ఇపుడు ఆ సామాజికవర్గంతో పాటు మిగిలిన అగ్రవర్ణాల వారిని కూడా దారిని తెచ్చుకునేందుకు స్కీమ్స్ రెడీ చేస్తోంది అని అంటున్నారు.

అలాగే నిరుద్యోగ యువతను కూడా టార్గెట్ చేస్తూ జాబ్స్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చేలా కూడా భారీ  ప్లాన్స్ చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు రెట్టింపు సంక్షేమం అని బరిలోకి దిగబోతున్నారు. ఈ విషయాలను గమనిస్తున్న వైసీపీ కూడా తాము అధికారంలో ఉండగానే వీలైనన్ని చేయడం ద్వారా ఏ సామాజిక‌ వర్గమూ దూరం కాకుండా చేసుకోవాలనుకుంటోంది.

అదే టైం లో కొత్త పధకాలను కూడా 2024 ఎన్నికల ముందు ప్రకటించేందుకు వైసీపీ సిద్ధపడుతోంది. అయితే సంక్షేమ పధకాలు ఉచితాలు పూర్తిగా ఖజానాను కొల్లగొడుతున్నాయ‌ని, ఆర్ధిక ఇబ్బందులకు దారితీస్తున్నాయని బీజేపీ నేత ఒకరు సుప్రీం కోర్టులో వేసిన కేసు ఇపుడు  విచారణ దశలో ఉంది. ఈ కేసులో కనుక తీర్పు సంక్షేమానికి వ్యతిరేకంగా వస్తే అటు జగన్ ఇటు బాబు ఆశలు పెద్ద ఎత్తున  గల్లంతే అంటున్నారు. మొత్తానికి సంక్షేమమే క్షేమమ‌ని, అధికారానికి దగ్గర దారి అని రెండు ప్రధాన పార్టీలు భావించడం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News