ఆ కేసులో ‘‘తుపాకీ’’ మీద కొత్త లెక్కలు

Update: 2016-02-11 04:50 GMT
అందరి దృష్టిని ఆకర్షించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైద్యుల మధ్య కాల్పులు.. వైద్యుడి సూసైడ్ (?) ఉదంతంపై సరికొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఉన్న సందేహాలకు సరిపోవన్నట్లుగా తాజాగా మరిన్ని డౌట్లు రావటం గమనార్హం. అదే సమయంలో మరికొన్ని అంశాల మీద ఇప్పటివరకూ సందేహాలు ఉన్నా.. అవి తొలిగిపోయినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

కొత్త సందేహాలు ఏమంటే..?

= ఈ ఉదంతంలో ఉపయోగించిన తుపాకీలు ఎన్ని అన్నది ఒక ప్రశ్నగా మారింది.

= ఘటనా స్థలంలో రివాల్వర్ లోని ఖాళీ గాడ్జెట్ ఏమైందన్నది సందేహంగా మారింది.

= కాల్పుల ఘటనలో డాక్టర్ సాయి పాత్ర ఏమిటి?

= కాల్పులు జరిగిన సమయంలో ఆయనెలా వ్యవహరించారు?

= శశికుమార్ రాసిన సూసైడ్ లేఖలో పేర్కొన్న ఓబుల్ రెడ్డి.. రామారావు.. కె.కె.రెడ్డి.. చెన్నారెడ్డిలు ఎవరు?

= శశికుమార్ తనతో తీసుకెళ్లిన కారు.. బ్రీఫ్ కేస్ ఎక్కడ?

= హిమాయత్ నగర్ లో సోమవారం సాయంత్రం 4 నుంచి 4.15 గంటల మధ్య కాల్పులు చోటు చేసుకుంటే డాక్టర్ శశికుమార్ సోమాజిగూడలోని చంద్రకళ ఇంటికి సాయంత్రం ఆరు గంటలకు వెళ్లారు. హిమాయత్ నగర్ నుంచి సోమాజిగూడలోని చంద్రకళ ఇంటికి అరగంటలో వెళ్లే వీలుంది. మరి.. మిగిలిన గంటన్నర డాక్టర్ శశికుమార్ ఎక్కడు ఉన్నారు?

= డాక్టర్ శశికుమార్ కాల్ డేటా బయటకు ఎందుకు రావటం లేదు?

స్పష్టత వచ్చిన అంశాలు

= డాక్టర్ ఉదయ్ కుమార్ మీద కాల్పులు జరిపింది డాక్టర్ శశికుమారే

= చంద్రకళ (సూసైడ్ చేసుకున్న డాక్టర్ శశికుమార్ స్నేహితురాలు) చెప్పిన మాటలన్నీ నిజమేనంట
Tags:    

Similar News