కలకలం రేపుతున్న డాక్టర్ సుధాకర్ తాజా లేఖ?

Update: 2020-05-28 06:15 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఏపీకి చెందిన డాక్టర్ సుధాకర్ ఉదంతంలో తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆయన విశాఖలోని మానసిక వైద్యశాలలో చేర్చి చికిత్స ఇస్తున్నారు. తనపై ఉద్దేశ పూర్వకంగా తనను ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపించిన ఆయన.. తాజాగా నాలుగు పేజీల లేఖను రాశారు. తనకు చేస్తున్న వైద్యంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ మానసిక వైద్యశాలలోని వాతావరణం.. పరిసరాలు గందరగోళంగా ఉన్నాయన్న వేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి చీఫ్ డాక్టర్ రాధారాణికి రాసిన లేఖలో పలు అంశాల్ని ప్రస్తావించారు. తనపై ప్రయోగిస్తున్న మందులు తనను సైకోలా మార్చే ప్రమాదం ఉందన్నారు. రోజూ రాత్రివేళలో నాలుగు రకాల మాత్రలు.. ఒక ఇంజెక్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. ఆ సమయంలో పెదాలు తడారిపోవటం.. మూత్రం ఆగిపోవటం.. కళ్లు మసకబారటం.. ఆయాసం రావటం.. తల తిరగటం లాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్న చెప్పారు.

నోటిపై పుండ్లు వచ్చాయని.. క్రమేణ శ్వాసనాళ సంబంధ న్యూమోనియాకు దారి తీసే అవకాశం ఉందంటున్నారు. తనకు వైద్యం చేస్తున్న డాక్టర్ రామిరెడ్డి తనకు పలు రకాల మానసిక రుగ్మతలకు వినియోగించే మందుల్ని వాడుతున్నట్లుగా ఆరోపించారు. ఇప్పుడాయన లేఖ సంచలనంగా మారింది.మరి.. దీనికి ప్రభుత్వం ఏమని బదులిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News