డ్రగ్స్ చాక్లెట్లు.. స్కూళ్లు, కాలేజీల దగ్గర అమ్మకం

Update: 2022-04-22 05:24 GMT
ఆఖరుకు పిల్లలు తినే చాక్లెట్లలో కూడా డ్రగ్స్ కలిపి అమ్ముతున్నారు కొందరు కేటుగాళ్లు.. ఎండాకాలం అని చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లు తింటున్న పిల్లల పాలిట ఇవి వ్యసనంగా మారే ప్రమాదం నెలకొంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే పిల్లలకు పెను ప్రమాదం తప్పదు. చెన్నై మహానగరంలో డ్రగ్స్ చాక్లెట్లు కలకలం రేపుతున్నాయి. స్కూల్స్, కాలేజీల సమీపంలో డ్రగ్స్ చాక్లెట్లు అమ్ముతున్నారనే వార్తల నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

పాఠశాలలు, కళాశాలల సమీపంలో డ్రగ్స్ చాక్లెట్స్ సప్లై అవుతున్నట్టు అధికారులకు సమాచారం రావడంతో అలెర్ట్ అయ్యారు. పరిసరాల్లో ఉన్న కిరాణా స్టోర్స్ , సూపర్ మార్కెట్స్ లో ఆకస్మిక తనికీలు చేశారు. డ్రగ్స్ మిక్స్ చేసి అమ్ముతున్నారనే అనుమానాలకు బలం చేకూర్చేలా.. అక్కడున్న ఐటమ్స్ పై లేబుళ్లు లేవు.

జెల్లీ , ఐస్ క్రీం, చాక్లెట్స్ లను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. వాటిని ల్యాబ్ కు పంపించి పరీక్షలు అధికారులు నిర్వహిస్తున్నారు.

ఈ లేబుల్స్ లేని ఐటమ్స్ ఎక్కడ తయారవుతున్నాయి.? వాటిని ఎక్కడ నుంచి సప్లై చేస్తున్నారు.  ఆ అంశాలపై విచారణ చేస్తున్నారు అధికారులు.

డ్రగ్స్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. భారతదేశానికి అద్వితీయ సంపదైన యువతను చిత్తు చేసే మత్తుపై, గవర్నమెంట్స్ ఇంకాస్త ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.
Tags:    

Similar News