ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రోజుకో పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికలు వాయిదా వేసినా రాజకీయం రసకందాయంగా మారుతోంది. రాజకీయాలకు పరిమితమైన ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం తో ఒక్కసారిగా పరిణామాలు వేగంగా మారాయి. ఒక రాజ్యంగ బద్ధమైన స్వతంత్ర సంస్థను, ఆ సంస్థ అధిపతిని ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేయడం సరికాకపోయినా అతడి వ్యవహార శైలితో వైఎస్సార్సీపీ అధినేత, సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ పరిణామంపై కేంద్రానికి కూడా ఓ నివేదిక ఇచ్చారని సమాచారం. ఈ మేరకు ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు కేంద్ర హోం శాఖ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఎన్నికల వాయిదా అనంతరం నెలకొన్న పరిస్థితుల తో ఏకంగా ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు రావడం తో కేంద్రం స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వెంటనే ఢిల్లీకి రావాలని రమేశ్ కుమార్ కు పిలుపు వచ్చిందంట.
రాష్ట్ర ప్రభుత్వంతో కనీస సంప్రదింపులు చేయకుండా.. పైగా కరోనా వైరస్ అంటూ వాయిదా వేయగా ఆరోగ్య శాఖను సంప్రదించకుండా ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారని కేంద్రం గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు.. అందుకే వెంటనే రమేశ్ కుమార్ కు పిలుపు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు అది ఎన్నికల సంఘం ఇష్టమని.. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసీ తప్పు చేసిందని రుజువైంది. దీంతో వ్యక్తిగతంగా.. ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా వేసిన కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తప్పించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు చర్యలు చేపడుతున్నారంట.
ఈ మొత్తం వ్యవహారం తెలుసుకునేందుకు కమిషనర్ రమేశ్ కుమార్ ను వెంటనే ఢిల్లీకి రమ్మన్నట్టు సమాచారం. ఈ క్రమంలో విచారణ చేసి కేంద్ర హోం శాఖ రమేశ్ ను తప్పించేట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత అజెండా అమలు చేయడం తో రమేశ్ ను కమిషనర్ స్థానం నుంచి తొలగించే అవకాశం ఉంది. అయితే ఆయనను తప్పిస్తే కమిషనర్ గా రమాకాంత్ రెడ్డిని నియమించాలని జగన్ సూచిస్తున్నారట. దీంతో త్వరలోనే రమేశ్ కు ఉద్వాసన పలికి కొత్త వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికలు మాత్రం కరోనా వైరస్ నేపథ్యంలో మరికొన్నాళ్లు ఆగాల్సిందేనని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.