YES బ్యాంక్ రాణా స్కెచ్ తెలిస్తే మతిపోవాల్సిందే ?

Update: 2020-03-11 11:30 GMT
భారతీయ ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థలో కొద్దికాలంగా అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన YES బ్యాంకు గత కొన్ని రోజులుగా సంక్షోభంలో పడిపోయింది. తాజాగా ఈ సంక్షోభం తీవ్రతరం కావడంతో ...బ్యాంకు నుండి అకౌంట్ హోల్డర్స్ డబ్బులు డ్రా చేయకుండా ..పరిమితులు విధించిన విషయం తెలిసిందే. అయితే, అకౌంట్ హోల్డర్స్ కి ఇటువంటి భయం అక్కర్లేదు అని కేంద్రం , ఆర్బీఐ ప్రకటించింది. అయితే , YES బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో అనేక అనుమానాలు కలగడంతో YES బ్యాంకు వ్యవస్ధాపకుడు రాణా కపూర్‌ ని ఈడీ తమ కస్టడీలోకి తీసుకోని దర్యాప్తు మొదలుపెట్టింది.

ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయని సమాచారం. యస్‌ బ్యాంక్‌ కేసులో దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్న రాణా కపూర్‌ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న క్రమంలో దేశ రాజధానిలో తన భార్య బిందూ కపూర్‌ పేరిట ఉన్న మూడు విలాసవంతమైన భవనాలను విక్రయించేందుకు రాణా కపూర్‌ ప్రయత్నాలు చేశారని తెలిసింది. రూ 4300 కోట్ల అనుమానిత లావాదేవీలు జరిగిన యస్‌ బ్యాంక్‌ వ్యవహారంలో బిందూ కపూర్‌ కూడా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.

ఢిల్లీలోని ప్రైమ్‌ లొకాలిటీలో 40, అమృత షెర్గిల్‌ మార్గ్‌ లోని భవంతిని బిందు బ్లిస్‌ అడోబ్‌ సంస్థ పేరిట కొనుగోలు చేశారు. బ్లిస్‌ విల్లా ప్రైవేట్‌ లిమిడెట్‌ పేరుతో ఢిల్లీలోనే మరో రెండు ఆస్తులను కొనుగోలు చేశారు. రూ 1000 కోట్ల విలువైన ఈ మూడు భవంతులను విక్రయించేందుకు తగిన పార్టీలను అన్వేషించాలని ఢిల్లీలోని కొందరు ప్రాపర్టీ డీలర్లను రాణా కపూర్‌ సంప్రదించినట్టు సమాచారం. తనపై ఈడీ దర్యాప్తు సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ, ముంబైలోని ఆస్తులను అమ్మి అమెరికా కాకుంటే బ్రిటన్‌ లేదా ఫ్రాన్స్‌కు మకాం మార్చాలని రాణా కపూర్‌ యోచించారని తెలిసింది. అలాగే దేశం విడిచి వెళ్ళేలోపు, భారత్ లో ఉన్న ఆస్తులని విక్రయించుకోవాలని చూసారని చెబుతున్నారు. అయితే , ఆ ప్రయత్నాలని ఈడీ సమర్థవంతంగా తిప్పికోట్టింది.

మరోవైపు అవంత రియల్టీ యస్‌ బ్యాంక్‌ కు చెల్లించాల్సిన రుణం బకాయి పడటం తో అదే సంస్థకు చెందిన అమృత షెర్గిల్‌ మార్గ్‌ లోని విలాసవంతమైన భవనాన్ని బిందు కపూర్‌ బ్లిస్‌ అడోబ్‌ కంపెనీ పేరిట కొనుగోలు చేయడం గమనార్హం. అవంత రియల్టీకి యస్‌ బ్యాంక్‌ రూ 500 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇక రుణ మొత్తాన్ని రికవర్‌ చేసేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించని యస్‌ బ్యాంక్‌ బ్లిస్‌ అడోబ్‌ కు కేవలం రూ 380 కోట్లకే కట్టబెట్టింది. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన అమృత షెర్గిల్‌ మార్గ్‌ లోని ఈ భవంతి విలువ రూ 450 కోట్లు పలుకుతుందని అనుకుంటున్నారు.
Tags:    

Similar News