తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చుట్టూ మరో ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో ఆయన ఇరకాటంలో పడనున్నట్లు సమాచారం. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీకి ఓటు వేయాలంటూ నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షలు రేవంత్ ఇవ్వచూపారు. ఈ కేసులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏ-1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబుకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈడీ నోటీసుల్లో భాగంగా రేవంత్ విచారణతో ఈ మేరకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
ఓటుకునోటు ఎపిసోడ్ లో ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్ లో ఏపీ సీఎం చంద్రబాబు పేరు ఉండడంతో ఆ దిశగా రేవంత్ పై ప్రశ్నలు సంధించారు. రేవంత్ రెడ్డిని విచారిస్తున్న సందర్భంగా ఏసీబీ దాఖలు చేసిన కేసులో చంద్రబాబు పేరును 20 సార్లు రికార్డు చేశారు. రేవంత్ ను ఎనిమిది గంటలకుపైగా విచారించిన ఈడీ అధికారులు వివిధ కోణాల్లో ఆయన నుంచి సమాచారం రాబట్టడానికి ప్రశ్నించారు. చంద్రబాబు దేని గురించి స్టీఫెన్ సన్ దగ్గరకు పంపించారని ఈడీ అడిగింది. స్టీఫెన్ సన్ కు తొలుత రూ. 50 లక్షలు ఇవ్వడం - మిగతా రూ. 4.50 కోట్లు ఎవరి నుంచి నగదు తలిస్తున్న విషయాలపై రేవంత్ ను ప్రశ్నించారు. మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయంపై ఈడీ అధికారులు తరచితరచి ప్రశ్నించినట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా ఏపీ ఇంటిలిజెన్స్ అధికారులు సైతం ఈడీ అధికారుల ముందు హజరయ్యారు. రేవంత్ ను విచారించిన తీరు - ఈడీ దర్యాప్తు పరిణామాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు త్వరలో నోటీసులు పంపడం ఖాయమంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ లో ఇది ఒకటని అంటున్నారు.