అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనకు ఈ మహమ్మారి అంటుకుంది. అయితే ప్రస్తుతం ట్రంప్ వయసు 74 ఏళ్లు. ఆయన వయసుకు.. బరువు ఎక్కువగా ఉండడం.. పురుషుడు కావడంతో చాలా డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యాన్ని వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ఆయన వయసు 74. బరువు ఎత్తుల నిష్పత్తి (బీఎంఐ) ట్రంప్ కు 30కిపైగానే ఉంది. ఇది ఉబకాయంగా తేల్చారు. ఇన్ఫెక్షన్ తీవ్రం అయితే వయసు పైబడిన ట్రంప్ కు డేంజర్ అని అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా ప్రాంతాల్లో చేపట్టిన అధ్యయనాల ప్రకారం పిల్లలు, యువకులపై ఈ వైరస్ అంతగా ప్రభావం చూపడం లేదని తేలింది. కరోనా బాధితుల్లో 75 ఏళ్లు పైబడిన ప్రతి 25మందిలో ఒకరు కరోనాతో మరణిస్తున్నారు. అదే వయసు 80 ఏళ్లు దాటితే ప్రతి ఏడుగురిలో ఒకరు..90 ఏళ్లు దాటితే నలుగురిలో ఒకరు చనిపోతున్నారు. వయసు పెరగడంతో కరోనా వైరస్ తో మరణించే ముప్పు కూడా పెరుగుతోంది.
అమెరికా దేశంలో ప్రతి 10 కరోనా మరణాల్లో ఎనిమిది 65 ఏళ్లు పైబడిన వారేనని సీడీసీ తెలిపింది. ట్రంప్ వయసులో ఉండేవారికి ఆసుపత్రి చికిత్స అవసరమయ్యే అవకాశం ఐదు రెట్లు ఎక్కువని వెల్లడించారు. 20 ఏళ్ల వయసులో ఉండేవారితో పోల్చితే ట్రంప్ వయసులో వారు మరణించే ముప్పు 90 రెట్లు ఎక్కువని వివరించారు.
వయసు పైబడడంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం.. ఆరోగ్యం క్షీణించడం తదితర కారణాలే ఈ ముప్పును పెంచుతున్నాయని తేలింది.
అయితే ట్రంప్ కు ఎలాంటి లక్షణాలున్నాయన్నది తెలియలేదు. ఆయనలో తీవ్రమైన లక్షణాలు కనిపించలేదని తెలుస్తోంది. పైగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆరోగ్య సేవలు ఆయనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ట్రంప్ ఆరోగ్యంపై అప్పుడే ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం లేదని అక్కడి వైద్య నిపుణులు చెబుతున్నారు.