ప్రపంచ కుబేరుడిగా సుపరిచితుడైన ఎలాన్ మాస్క్ తరచూ ఏదో ఒక వివాదంలో ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. డబ్బులు ఉండగానే సరికాదు.. దానికి తగ్గట్లు గౌరవ మర్యాదలు అవసరం. అంతేనా.. డబ్బుల విషయంలో అంతో ఇంతో ఉదారంగా ఉండాల్సిన అవసరం ఉంది. లక్షల కోట్ల రూపాయిలు ఉన్నప్పటికీ.. కట్టుకుపోయేది లేనప్పుడు.. అద్భుతమైన టాలెంట్ ఉన్న వారిని అక్కున చేర్చుకునేలా తీరు ఉండాకానీ.. పైసల కోసం కక్కుర్తి పడే తీరు ఏ మాత్రం సరికాదు. తాజాగా బయటకు వచ్చిన ఉదంతంలో.. టెస్లా అధినేత ఎలాన్ మాస్కు దరిద్రపుగొట్టు బేరాలు బయటకు వచ్చి ప్రపంచం చేత చావుతిట్లు తినిచ్చుకుంటున్నాడు.
అద్భుతమైన మేధస్సు ఉన్న ఒక కాలేజీ కుర్రాడికి ఇచ్చే డబ్బుల విషయంలో ఎలాన్ మాస్కు వ్యవహరించిన కక్కుర్తి ఆయన ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసేలా మారిందని చెబుతున్నారు. ఇంతకూ అసలేం జరిగింది? అంతలా ఎందుకు డ్యామేజ్ అయ్యారు? అన్న వివరాల్లోకి వెళితే..
టెక్నాలజీతో ఉన్న సమస్య ఏమంటే.. దాన్ని తయారు చేసినోడు మేధావి అయితే సరిపోదు. దానిలోని లోపాల్ని వెతికే మేధావితోనే అసలు సమస్య. ఎందుకంటే.. తాను గుర్తించి లోపాల విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. దీనికి ఒపిగ్గా.. నేర్పుగా డీల్ చేసే టాలెంట్ చాలా అవసరం. విషయంలోకి వెళితే.. అలాంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న కుర్రాడి పేరు జాక్ స్వీన్. అతడికి అక్షరాల 19 ఏళ్లుమాత్రమే.
ఇతగాడి ప్రత్యేకత ఏమంటే.. అత్యంత ప్రముఖుల ప్రైవేటు జెట్లను ట్రాక్ చేస్తుంటాడు. ఇందులో ఎలన్ మస్క్ కు చెందిన ప్రైవేటు జెట్ కు సంబంధించిన డేటాను సేకరించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎలన్ మాస్కు. ఆ కుర్రాడితో బేరం మొదలు పెట్టారు. తన వ్యక్తిగతభద్రత నేపథ్యంలో తన ప్రైవేట్ జెట్ ను ట్రాక్ చేయటం ఆపాలని కోరారు. ఇందుకు.. సదరు స్టూడెంట్ కు 5వేల డాలర్లు ఇస్తానని మాటిచ్చారు. మన రూపాయిల్లో చూస్తే.. రూ.3.75 లక్షలు.
అయితే.. ఎలన్ ఇచ్చిన ఆఫర్ తక్కువని.. 5వేల డాలర్లు కాదు 50 వేల డాలర్లు ఇవ్వాలని కోరాడు. అంటే.. మన రూపాయిల్లో రూ.37.55 లక్షలు మాత్రమే. అయితే.. ఆ కుర్రాడు కోరిన మొత్తం చాలా ఎక్కువని.. ఎలన్ మాస్కు బేరానికి దిగాడు. అయితే.. సదరు కుర్రాడు స్పందిస్తూ.. తనకుఇచ్చే డబ్బులతో తన స్కూల్ ఫీజుల్నిచెల్లించటంతో పాటు టెస్లా కారు కొనాలన్న కల కూడా నెరవేరుతుందని పేర్కొన్నారు. అయితే.. అందుకు స్పందించిన ఎలాన్ మాత్రం.. అది చాలా పెద్ద మొత్తం అని చెప్పి.. మళ్లీ అతడ్ని కలిసే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో ఈ ఇద్దరు మధ్య జరిగిన సమాచారాన్ని సదరు కుర్రాడు బయటపెట్టేశాడు. దీంతో.. దీని గురించి తెలిసిన ప్రతి ఒక్కరు.. ఎలన్ మాస్కును తిట్టిపోస్తున్నారు. ఇదేం బుద్ధి.. మరీ ఇంతలా బేరం ఆడాలా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే.. సదరు కుర్రాడి రియాక్షన్ మాత్రం భిన్నంగా ఉంది. ఎలన్ మాస్కు తనకు తానుగా బేరానికి రావటం కాస్తంత ఎగ్జయిటింగ్ గా ఉందని..ఫ్యూచర్ లో టెస్లా కానీ.. స్పేస్ ఎక్స్ తో కానీ పని చేసే అవకాశం వస్తుందన్న ఆశను వ్యక్తం చేశాడు. తన ట్వీట్ తో భారీగా బద్నాం చేసిన ఈ కాలేజీ కుర్రాడికి టెస్లా అధినేత ఎలాంటి ఆఫర్ ఇస్తారో చూడాలి. దీనికి కాలమే సరైన సమాధానం ఇస్తుందేమో చూడాలి