ట్రంప్‌ ట్విట్టర్ ఎకౌంట్ నిషేధంపై ఎలన్ మస్క్‌ పోల్

Update: 2022-11-19 10:30 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో విద్వేశాలు రెచ్చగొడుతున్నాడని నాడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను నిషేధించారు. ట్రంప్ ట్విటర్ ఖాతా ఇప్పటికీ బ్లాక్ లోనే ఉంది. అయితే ట్విటర్ ను కొనుగోలు చేశాక కొత్త యజమాని ఎలన్ మస్క్ ఈ డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్దరిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ విద్వేశాలకు ఆస్కారం ఇస్తుందని.. యాడ్స్ కట్ చేస్తామని కంపెనీలు బెదిరించడంతో వెనక్కి తగ్గారు.తాజాగా ఎలన్ మస్క్ ట్విస్ట్ ఇచ్చాడు.

ట్రంప్ ను మళ్లీ ట్విటర్ లోకి తీసుకోవాలా? వద్దా? అనే దానిపై ఓటింగ్ పెట్టారు.విద్వేష వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు ఎలన్ మస్క్ తెలిపారు. ట్రంప్ ఖాతాను పునరుద్దరించడంపై కూడా ఓటింగ్ పెట్టామని.. ఇప్పటికే కొందరి ఖాతాలను పునరుద్దరించామని.. అయితే ట్రంప్ ఖాతా గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

ట్రంప్ ను ట్విటర్ లోకి తీసుకోవాలా? వద్దా? అనేదానిపై పోలింగ్ పెట్టామని.. ప్రజల నిర్ణయమే.. దేవుడి నిర్ణయంగా భావిస్తానని ఎలన్ మస్క్ తెలిపారు. ఇప్పటివరకూ పోలింగ్ లో 50 లక్షల మందికి పైగా పాల్గొనగా.. దాదాపు సగం మంది ట్రంప్ ఖాతాను పునరుద్దరించేందుకు అనుకూలంగా ఓటేసినట్లు తెలుస్తోంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను గత అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ విద్వేశాలు రెచ్చగొట్టాడని టాప్ సోషల్ మీడియా దిగ్గజాలు అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్ లు నిషేధించాయి. ట్రంప్ కు వాయిస్ లేకుండా చేశాయి. దీంతోపాటు ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ ఇక శాశ్వతంగా ట్విట్టర్ కు గుడ్ బై చెప్పాడు. తన సొంత సోషల్ మీడియా 'ట్రూత్'ను ప్రారంభించి అందులో కొనసాగుతున్నాడు.

ట్విట్టర్ లో 303.8K ఫాలోవర్లు ట్రంప్ కు ఉన్నారు. అమెరికన్లు అంతా అందులో ఆయన్ను ఫాలో అవుతున్నారు. మస్క్ పునరుద్దరిస్తే ట్రంప్ ఆలోచన మారే అవకాశం ఉంది. వీరి మధ్య బాండింగ్ తో ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News