భూమిపైన నివశించిన అతి పెద్ద జంతువులు ఏవి అని అడిగితే ఎవరైనా కూడా వెంటనే చెప్పే పేరు రాక్షసబల్లులు.కొన్ని కోట్ల సంవత్సారాల క్రితం ఈ రాక్షసబల్లులు భూమి పై అంతరించిపోయాయి. ఉల్కలు భూమిని ఢీకొట్టడం వలన జరిగిన ప్రమాదాల వలన డైనోసార్స్ అంతరించిపోయాయి. ఆ తరువాత అడపాదడపా ఉల్కలు భూమీని ఢీకొడుతూనే ఉన్నాయి. అయితే, మనిషి ఆవిర్భవించిన తరువాత టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకున్నాక మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగడుతూ వాటిని ఎదుర్కొంటున్నాడు. కొన్ని సంవత్సరాల్లో భూమిని ఢీకొట్టేందుకు అతిపెద్ద ఆస్ట్రాయిడ్ ఒకటి భూమివైపు వస్తున్నట్టు నాసా గుర్తించింది.
ఇది భూమిని చేరుకోక ముందే బ్లాస్ట్ చేసేందుకు నాసా డార్ట్‌ను ప్రయోగించింది. ఈ డార్ట్‌ను ఎలన్ మస్క్‌కు కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. నాసా పరిశోధనలలో ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ భాగం పంచుకుంటున్న సంగతి తెలిసిందే. 2022 చివరినాటికి ఈ డార్ట్ తన టార్గెట్‌ను ఛేదిస్తుంది. ఇప్పటికే కొన్ని సమయాల్లో కొన్ని ఉల్కలు పడి విధ్వంసం సృష్టించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాలు కోలుకున్నా, ఏళ్లు గడుస్తున్నా.. ప్రాణ భయం ఇప్పటికీ అక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉంది. అంతరిక్షం నుంచి ఎప్పుడు ఎటు నుంచి ఇలాంటి ముప్పు పొంచి ఉందో అనే ఆందోళన ప్రపంచం మొత్తం నెలకొంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఇలాంటి ఘటనలు తప్పించేందుకే నాసా ఇప్పుడు డార్ట్ ను లాంఛ్ చేసింది.
గ్రహశకలాలు, ఉల్కలు.. ఎప్పటికైనా భూమికి ప్రమాదకరమైనవే. అంతరిక్షంలో వాటిని స్పేస్ క్రాఫ్ట్‌ల ద్వారా ఢీకొట్టే ఆలోచనే డార్ట్. డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్. నాసా ఆధ్వర్యంలో DART నవంబర్ 24న ప్రయోగించారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కాలిఫోర్నియాలోని స్పేస్ స్టేషన్ నుంచి డార్ట్‌ను లాంఛ్ చేశారు. ఇందుకోసం ఎలన్ మస్క్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ను ఉపయోగించారు. సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉండే గ్రహశకలాల్ని, ఉల్కలను నాశనం చేసేందుకు న్యూక్లియర్ వెపన్స్‌ను ఉపయోగిస్తుంటారు. అప్పుడు అవి ఆకాశంలోనే నాశనం అవుతాయి. ఒక్కోసారి అవి సముద్రంలో పడిపోతుంటాయి. లేదంటే ఏదైనా ప్రాంతంలో పడి తక్కువ మోతాదులో డ్యామేజ్ చేస్తుంటాయి. కానీ, ఈ పరిస్థితులకు వీలులేని గ్రహశకలాలు, ఉల్కల సంగతి ఏంటి, అవి గమనం మార్చుకోవాలనే ప్రార్థిస్తుంటారు అంతా. కానీ, వాటిని స్పేస్‌క్రాఫ్ట్‌తో ఢీ కొట్టించి నాశనం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా. ఇది గనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ప్రమాదకరమైన గ్రహశకలాలు, ఉల్కాపాతాల నుంచి భూమికి జరిగే డ్యామేజ్‌ను తప్పించొచ్చనేది నాసా ఆలోచన. కాగా, దీనిపై ఎలన్ మస్క్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. భూమిపై నివశించిన రాక్షసబల్లులను నాశనం చేసిన ఆస్ట్రాయిడ్స్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.