మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి గడిచిన మూడు నాలుగు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి తెలిసిందే. సంచలనంగా మారిన ఈ వ్యవహారానికి సంబంధించి మరో కీలక ప్రకటన బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలున్న ఎర్ర గంగిరెడ్డి.. కోర్టు ఎదుట లొంగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పాలి.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో.. ఆయన మాట్లాడుతూ.. సీబీఐ కోర్టులో ఎప్పుడు లొంగిపోవాలనే అంశం మీద తన న్యాయవాదితో చర్చిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేయటం.. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఏప్రిల్ 27న బెయిల్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో మే 5 లోపు సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ ఎదుట లొంగిపోయేందుకు మరో రోజు మాత్రమే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు చెప్పినట్లుగా లొంగిపోకుంటే ఏం చేయాలన్న దానిపై సీబీఐ కసరత్తు చేస్తోంది. గడువు లోపు లొంగిపోకుంటే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. జూన్ 30వరకు దర్యాప్తునకు గడువు ఉన్న నేపథ్యంలో అప్పటివరకు ఎర్ర గంగిరెడ్డిని రిమాండ్ కు తరలించాలని తీర్పు వెల్లడించిన సమయంలో హైకోర్టు షరతు విధించింది.
హైకోర్టు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగుస్తున్న నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి తన న్యాయవాదితో చర్చలు జరుపుతున్నారు. తమ న్యాయవాది ఇచ్చే సూచనకు అనుగుణంగా లొంగిపోయే వీలుందంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితులతో చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఒకవేళ ఎర్ర గంగిరెడ్డి లొంగిపోకుంటే మాత్రం.. సీబీఐ ఆయన్ను అదుపులోకి తీసుకోవటం ఖాయమంటున్నారు. అయితే.. ఆయన కోర్టు చెప్పినట్లే లొంగిపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.