సెక్సీ ఉల్లిపాయ ఫొటో తొలగించిన ఫేస్ బుక్.. ట్విస్ట్ ఇదే?

Update: 2020-10-10 01:30 GMT
రాజకీయ నేతల విద్వేష ట్వీట్ల తొలగింపు విషయంలో సర్వత్రా విమర్శల పాలవుతున్న ఫేస్ బుక్.. తాజాగా వింత నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ పేజీల్లో విద్వేషపూరిత, రెచ్చగొట్టే , కించపరిచే సమాచారాన్ని ఆటో మేటిక్ గా తొలగించేందుకు ఆల్గారితమ్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఓ ఉల్లిపాయ ఫొటోను తొలగించింది. చివరికి సోషల్ మీడియా దిగ్గజం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

ఫేస్ బుక్ తీసుకున్న ఈ నిర్ణయంపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. కెనడాకు చెందిన ఓ విత్తనాల విక్రేత తన ఫేస్ బుక్ పేజీలో ప్రీమియం ఉల్లిపాయల ఫొటో ఉంచాడు. ఈడబ్ల్యూ గేజ్ అనే ఈ విక్రేత ద సీడ్ కంపెనీ అనే తన ఫేస్ బుక్ పేజ్ లో ఎర్రగా ఊరించేలా ఉన్న ప్రీమియం ఉల్లిపాయలను అమ్మకానికి ఉంచాడు. దీన్ని చూసిన కొందరు అతడిని సంప్రదించి కొనుగోలు చేశారు.

కానీ అంతలోనే ఫేస్ బుక్ నుంచి ఓ సందేశం వచ్చింది. అతడు పెట్టిన ఉల్లిగడ్డల ఫొటో బహిరంగంగా సెక్స్ ను ప్రేరేపించేలా ఉందని.. సంస్థ విధానాలకు వ్యతిరేకంగా ఉందని.. అందులో చూసి అతడు షాకయ్యాడు. ఫేస్ బుక్ నుంచి వచ్చిన ఈ మెసేజ్ చూసిన ఉల్లిపాయల విక్రేతలైన షాపు యజమానులు దీని స్క్రీన్ షాట్ తీసి ఫేక్ బుక్ కు ఫిర్యాదు చేశారు. ఈ స్క్రీన్ షాట్ వైరల్ అయ్యింది.

కెనడాలోని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేస్తోంది. దీనిపై మీడియాలో చర్చ సాగింది.

అంతర్జాతీయంగా దీనిపై చర్చ సాగడంతో ఫేస్ బుక్ దీనిపై స్పందించింది. ఉల్లిపాయల ఫొటో తొలగించాలన్న తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు విక్రేత గేజ్ కు క్షమాపణ చెప్పింది. అల్గారితమ్ పొరబాట్ల వల్ల ఇలా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఉల్లిపాయ ఆకారం వల్ల ఫేస్ బుక్ ఆల్గారిథమ్ తప్పుగా అర్థం చేసుకొని ఇలా తొలగించి ఉండొచ్చని.. మొత్తం మీద ఫేస్ బుక్ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం సద్దు మణిగింది.
Tags:    

Similar News