కొలం చాలా చిత్రమైంది. 2004 నుంచి 2014 వరకు తెలుగు రాష్ట్రాల్లో తరచూ వినిపించిన రాజకీయ నేతల్లో దిగ్విజయ్ సింగ్ అలియాస్ డిగ్గీ రాజా. నాటి ఉమ్మడి రాష్ట్రంలో డిగ్గీ వారి హవా ఎంతలా నడిచిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన టైం కోసం తోపుల్లాంటి నేతలు సైతం చేతులు కట్టుకొని నిలబడిన పరిస్థితి.
మోడీ చేతికి పవర్లోకి వచ్చిన తర్వాత డిగ్గీ రాజా ప్రాభవం మసకబారింది. దీనికి తోడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలోనూ ఆయన జోరుకు బ్రేకులు వేయటంతో ఆయన ఈ మధ్య కాలంలో మీడియాతో పెద్దగా మాట్లాడటం లేదు. గతంలో తరచూ ట్వీట్లు చేసి.. మీడియాలో దర్శనమిచ్చే ఆయన.. ఈ మధ్యన వివాదాస్పద వ్యాఖ్యలకు.. సంచలన ట్వీట్లకు గ్యాప్ ఇచ్చారనే చెప్పాలి.
కాషాయదళానికి చెందిన పలువురు పద్మావత్ చిత్రాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఒక.. కర్ణిసేన హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయటమే కాదు..భారీ ఎత్తున హెచ్చరికలు చేశారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. దిగ్విజయ్ సింగ్ నోటి వెంట ఊహించని వ్యాఖ్యలు వచ్చాయి.
పద్మావత్ చిత్రంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఆ రాష్ట్రానికి చెందిన డిగ్గీ మాట్లాడుతూ.. పద్మావత్ చిత్రాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. పద్మావత్ లాంటి సినిమాల్ని తీయకపోవటం ఉత్తమమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరహా చిత్రాలు పలువురి మనోభావాల్ని గాయపరుస్తుందన్నారు. డిగ్గీ లాంటి కరుడుగట్టిన కాంగ్రెస్ నేత నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావటం సంచలనంగా మారింది. అందుకే అంటారు.. తమ దాకా వస్తే కానీ నొప్పి తెలీదని.