తిరుపతి: పవన్ పాదయాత్ర చేస్తే ఓట్ల వర్షం కురుస్తుందా?

Update: 2021-03-31 05:30 GMT
ఏపీలో బీజేపీ సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. ఇక కూటమిలో భాగస్వామి అయిన జనసేన కూడా ఇప్పుడు తిరుపతి పోరులో బరిలోకి దిగుతోంది. ‘పవన్ కళ్యాన్ సీఎం’ అని ప్రకటించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పుడు జనసేనాని రంగంలోకి దిగడంపై దృష్టిసారించారు. ఆయన కోసం భారీ ఏర్పాట్లు తిరుపతిలో చేస్తున్నారు.

తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కోసం పవన్ కళ్యాన్ ప్రచారపర్వంలో రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు పవన్ ఎంట్రీ ఖరారైంది. పవన్ కోసం బీజేపీ ఏకంగా ఓ కమిటీని వేయడం విశేషం.

తిరుపతిలో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయబోతున్నట్టు తెలిసింది. ఈ మేరకు జనసేన పార్టీ మంగళవారం ప్రకటించింది. ఏప్రిల్ 3న పవన్ తిరుపతిలో ప్రచారంలో పాల్గొంటారని.. రత్నప్రభ కోసం తిరుపతి పట్టణంలోని ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి ఏఐఆర్ బైపాస్ మీదుగా శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ పాదయాత్ర చేపడుతారని వెల్లడించారు.

పవన్ కు స్వాగతం పలికేందుకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ వేశారు. పెద్ద ఎత్తున జనాలను తరలిస్తున్నారు. రాయలసీమలోని 4 జిల్లాల నుంచి బీజేపీ కార్యకర్తలు, నేతలను తిరుపతికి రప్పిస్తున్నారు.

పవన్ తిరుపతి రంగంలోకి దిగడం.. ఏకంగా పాదయాత్రకు రంగం సిద్ధం చేయడంతో జనసేన-బీజేపీ నేతల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పవన్ పాదయాత్రతో బీజేపీకి ఓట్లు కురుస్తాయా? లేదా అన్నది చూడాలి.
Tags:    

Similar News